అక్షరటుడే, వెబ్‌డెస్క్: Amazon Prime Day Sale | ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారికోసం అమెజాన్ (Amazon) ప్రత్యేక ఆఫర్లతో ముందుకొస్తోంది. ఇందుకోసం ప్రైమ్ డే సేల్ ను ప్రకటించింది. వచ్చేనెలలో మూడు రోజులపాటు నిర్వహించే ఈ సేల్ అమెజాన్ ప్రైమ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఈ సేల్‌లో ఎక్స్‌క్లూజివ్ డీల్స్, భారీ ఆఫర్లను అందించనుంది. పలు కొత్త ఉత్పత్తుల అమ్మకాలనూ ఈ సేల్ వేదికగా ప్రారంభించనున్నారు.
Amazon Prime Day Sale | భారీ డిస్కౌంట్‌లు..
జులై 4న అర్ధరాత్రి 12 గంటలకు అమెజాన్ ప్రైమ్ డే సేల్ ప్రారంభమవుతుంది. 6వ తేదీ రాత్రి 11.59 గంటలకు ముగుస్తుంది. ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఎక్కువ ఆఫర్లు ఉండే అవకాశాలున్నాయి. స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలపై 70 శాతం వరకు డిస్కౌంట్లను అందించనుంది. ఎకో స్మార్ట్ స్పీకర్స్, అలెక్సా, ఫైర్ టీవీలపై దాదాపు యాభై శాతం వరకు ఆఫర్లు అందించనున్నట్లు తెలుస్తోంది. లార్జ్ అప్లయెన్సెస్ అయిన ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లతోపాటు హోమ్ అప్లయెన్సెస్, ఫర్నిచర్ తక్కువ ధరలో అందుబాటులో ఉండే అవకాశాలున్నాయి. సేల్‌కు ముందు ఆఫర్లను రివీల్ చేసే అవకాశాలున్నాయి.
కార్డ్ ఆఫర్లు : ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డులపై 10 శాతం వరకు తక్షణ డిస్కౌంట్ ఇవ్వనుంది. అమెజాన్ ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు హోల్డర్లకు 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
Amazon Prime Day Sale | రూ. 999 కే ప్రైమ్ మెంబర్‌షిప్..
అమెజాన్ ప్రైమ్‌డే సేల్ సందర్భంగా కొత్తగా ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవాలనుకునేవారికీ సంస్థ ఆఫర్‌ను ప్రకటించింది. ప్రస్తుతం ఏడాది ప్లాన్ ధర రూ. 1,499 ఉండగా.. దీనిని రూ.999కి అందించనుంది. ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్ ధరను రూ.799 నుంచి రూ.599, షాపింగ్ డిస్కౌంట్‌ల కోసం అందించే ఎడిషన్ ప్లాన్‌ను రూ.399 నుంచి రూ.299కి తగ్గించింది.
ఇది కూడా చదవండి..: Oracle layoffs AI | ఏఐ వైపు ఒరాకిల్ అడుగులు.. ఏడాదిలో 21 వేల మంది ఉద్యోగులపై వేటు