అక్షరటుడే, వెబ్డెస్క్: SpaceX Share Fall | స్పేస్ ఎక్స్ ఐపీవో (SpaceX IPO) ఆనందం నెమ్మదిగా ఇన్వెస్టర్లలో ఆవిరి అవుతోంది. ఆ సంస్థ షేర్లు మూడు ట్రేడింగ్ సెషన్లుగా పతనాన్ని చూస్తున్నాయి. దీంతో మార్కెట్ విలువ 600 బిలియన్ డాలర్లకుపైగా ఆవిరయ్యింది.
భారీ రుణ సమీకరణ కోసం ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ బాండ్లను విక్రయించనున్నట్లు వార్తలు రావడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు. సోమవారం ఒక్కరోజే కంపెనీ షేరు విలువ 16 శాతం పడిపోవడం గమనార్హం.
భారీ ఐపీవో : ఈ నెల ప్రారంభంలో నాస్డాక్లో స్పేస్ ఎక్స్ లిస్ట్ అయ్యింది. 75 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయి ఐపీవో లిస్టింగ్ తర్వాత ఈ కంపెనీ షేర్లు భారీగా ర్యాలీ చేశాయి. పబ్లిక్ ఇష్యూలో షేరు ధర 135 డాలర్లు కాగా.. కొన్ని రోజుల్లోనే దీని విలువ 60 శాతం వరకు పెరిగింది. ఐపీవో తర్వాత కంపెనీ విలువ దాదాపు 3 ట్రిలియన్ డాలర్లకు చేరువైంది.
SpaceX Share Fall | రుణ సమీకరణతో అమ్మకాల ఒత్తిడి..
తన వద్ద 100 బిలియన్ డాలర్లకుపైగా నగదు నిల్వలు ఉన్నాయని చెబుతున్న స్పేస్ ఎక్స్.. ఇదే సమయంలో 20 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ బాండ్లను జారీ చేయడానికి కసరత్తు చేస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు కంపెనీ పరిస్థితిపై అనుమానాలతో అప్రమత్తమయ్యారు. భారీ నిల్వలు ఉన్న కంపెనీ.. కొత్తగా రుణ సమీకరణ కోసం బాండ్లను జారీ చేయాల్సిన అవసరం ప్రశ్నిస్తూ అమ్మకాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం స్పేస్ ఎక్స్ కంపెనీ మార్కెట్ విలువ 2 ట్రిలియన్ డాలర్లకుపైగా ఉంది. మార్కెట్ విలువ ఆధారంగా ప్రపంచంలో ఆరో అతిపెద్ద కంపెనీగా నిలుస్తోంది.
ఇది కూడా చదవండి..: Amazon Prime Day Sale | 4 నుంచి అమెజాన్ ప్రైమ్ డే సేల్