అక్షరటుడే వెబ్‌డెస్క్: Ram Charan New Age Megastar | టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌పై భారత ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రశంసలు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల రిపబ్లిక్ టీవీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ, రామ్ చరణ్‌ను “న్యూ ఏజ్ మెగాస్టార్” (New Age MegaStar) అని కొనియాడారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ఒక తండ్రిగా ఎంతో గర్వంగా భావిస్తూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
Ram Charan New Age Megastar | మెగాస్టార్ భావోద్వేగం..
తన కుమారుడికి దక్కిన ఈ గౌరవం పట్ల చిరంజీవి సుమతీ శతకంలోని, “పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడు పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగా, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!” అనే పద్యాన్ని ప్రస్తావిస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. కుమారుడు పుట్టినప్పటి కంటే, సమాజం అతడిని మెచ్చుకుంటున్నప్పుడే తండ్రికి నిజమైన ఆనందం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.
Ram Charan New Age Megastar | గుండె గర్వంతో నిండిపోతోంది..
ఇలాంటి అరుదైన వేదికలపై రామ్ చరణ్‌కు లభిస్తున్న గుర్తింపును చూస్తుంటే ఒక తండ్రిగా తన గుండె గర్వంతో నిండిపోతోందని చిరంజీవి తెలిపారు. చరణ్ తన కఠిన శ్రమ, అంకితభావంతో కేవలం ప్రేక్షకులే కాకుండా, దేశ అగ్రనేతల ప్రశంసలు కూడా పొందడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో రామ్ చరణ్ మరిన్ని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచాలని ఆయన ఆకాంక్షించారు.
“పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడే పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగా, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!”
నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోది గారు పాల్గొన్న రిపబ్లిక్ టీవీ కార్యక్రమంలో రామ్ చరణ్‌ను “𝙉𝙚𝙬 𝘼𝙜𝙚 𝙈𝙚𝙜𝙖𝙎𝙩𝙖𝙧” అని సంబోధించడం నాకు ఎంతో ఆనందాన్ని… pic.twitter.com/sbddqa3m61
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 24, 2026
ఇది కూడా చదవండి: Journalist Accreditation Cards | అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు