అక్షరటుడే వెబ్‌డెస్క్: Ayodhya Trust Probe | అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు సంబంధించి వచ్చిన ఆర్థిక అవకతవకల ఆరోపణలపై తక్షణమే విచారణ జరిపించాలంటూ దాఖలైన పిటిషన్‌ను వినేందుకు సుప్రీంకోర్టు ( Supreme Court ) తిరస్కరించింది. ఈ కేసును అత్యవసరంగా (Urgent Listing) లిస్ట్ చేయాలని న్యాయవాదులు కోరగా, ధర్మాసనం అందుకు నిరాకరించి.. ఈ విషయాన్ని జూన్ 29న ప్రస్తావించాలని (Mention) సూచించింది.
Ayodhya Trust Probe | పిటిషన్ డిమాండ్..
రామాలయానికి వస్తున్న విరాళాల దుర్వినియోగంపై స్వతంత్ర దర్యాప్తు సంస్థ (CBI) నేతృత్వంలో విచారణ జరిపించాలని, కోర్టు పర్యవేక్షణలో ఈ ప్రక్రియ కొనసాగాలని పిటిషనర్లు కోరారు. అలాగే, విరాళాల రికార్డులు, సీసీటీవీ ఫుటేజ్ , డిజిటల్ లావాదేవీలను భద్రపరచాలని వారు విజ్ఞప్తి చేశారు. పిటిషన్లో ఎటువంటి లోపాలు లేకపోతే రిజిస్ట్రీ ఆ వివరాలను పరిశీలిస్తుందని కోర్టు పేర్కొంది. అత్యవసరంగా విచారణ జరపాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ, తదుపరి అడుగుల కోసం జూన్ 29న రావాలని పిటిషనర్లకు సూచించింది.
Ayodhya Trust Probe | ప్రస్తుత పరిస్థితి..
ఆలయ విరాళాల నిర్వహణలో పారదర్శకత లోపించిందని ఆరోపిస్తూ ఇప్పటికే పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ వ్యవహారంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసి విచారణ జరుపుతోంది. ఈ హై-ప్రొఫైల్ కేసులో సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనేది దేశవ్యాప్తంగా ఆసక్తిగా మారింది.
ఇది కూడా చదవండి: Karnataka Projects Impact | కర్ణాటక ప్రాజెక్ట్‌లతో రాష్ట్రానికి నష్టం : కవిత