అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Sanjay Raut | ‘ఆపరేషన్ టైగర్’ గురించి శివసేన (UBT) ఎంపీ సంజయ్ రౌత్ (MP Sanjay Raut) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీలోని ఆరుగురు ఎంపీలు షిండే శివసేనలో చేరిన విషయం తెలిసిందే. దీంతో ఆపరేషన్ టైగర్ విజయవంతం అయిందని ఏక్నాథ్ షిండే (Eknath Shinde) ఇటీవల తెలిపారు.
సంజయ్ రౌత్ గురువారం మాట్లాడుతూ.. తాను ఎప్పుడూ తప్పుడు గణాంకాలను చెప్పలేదన్నారు. పార్టీ మారిన వారికి రాత్రిపూట రూ. 15 కోట్లు ఇచ్చారని, ఆ తర్వాత వారందరినీ జైపూర్‌కు తరలించి, మళ్లీ రూ. 10 కోట్లు ఇచ్చారన్నారు. ఎంపీలకు ఇంకా ఎక్కువ ఇచ్చారని పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు కూడా ఆమోదం లభించాల్సి ఉంది, అందుకే ఆ ధర పెరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ డబ్బు కోసం తమను తాము వేలం వేసుకున్నారని చెప్పారు.
Sanjay Raut | 12 ఏళ్లుగా ఎమర్జెన్సీ
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఏ పార్టీనీ విచ్ఛిన్నం చేయలేదని పేర్కొంటూ సంజయ్ రౌత్ అన్నారు. తొమ్మిది మంది యూబీటీ సేన లోక్‌సభ ఎంపీలలో ఆరుగురు శివసేనలోకి ఫిరాయించిన నేపథ్యంలో ‘పార్టీని చీల్చడం’ అనే విమర్శ వచ్చింది. ముంబైలో విలేకరుల సమావేశంలో రౌత్ మాట్లాడుతూ, గత 12 ఏళ్లుగా దేశం ఎమర్జెన్సీలో ఉందని పేర్కొన్నారు. 1975 నాటి ఎమర్జెన్సీని సమర్థిస్తూ, రాజ్యాంగంలో దానికి నిబంధన ఉందని ఆయన అన్నారు. ఇందిరా గాంధీ ఏ రాజకీయ పార్టీని చీల్చలేదు, రాజ్యాంగాన్ని రద్దు చేయలేదని పేర్కొన్నారు.
Sanjay Raut | అరాచకం ప్రబలితే..

దేశంలో అరాచకం ప్రబలితే ఎమర్జెన్సీ విధించడానికి రాజ్యాంగంలో నిబంధన ఉందని ఆయన తెలిపారు. ఇందిరా గాంధీ విధించిన అత్యవసర పరిస్థితిని సమర్థించారు. పెద్ద నోట్ల రద్దు ఎందుకు అమలు చేశారని ప్రధాని మోదీని ఆయన ప్రశ్నించారు. బాలాసాహెబ్ థాకరే ఎమర్జెన్సీకి మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. కాగా 9వ తరగతి పాఠ్య పుస్తకంలో ఎన్సీఈఆర్టీ ఇటీవల ఎమర్జెన్సీపై పాఠ్యంశాన్ని చేరింది. ఈ క్రమంలో సంజయ్ వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి..: Digital Arrest Scam | డిజిటల్ అరెస్ట్ స్కామ్స్.. 16 రాష్ట్రాల్లో సీబీఐ మెరుపు దాడులు