Donald Trump Avenue | భారత్​కు ట్రంప్​ కృతజ్ఞతలు.. ఎందుకో తెలుసా?

హైదరాబాద్​లోని ఓ రోడ్డుకు తన పేరు పెట్టడంపై భారత్​కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ కృతజ్ఞతలు తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Donald Trump Avenue | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ (Donald Trump) భారత్​కు కృతజ్ఞతలు తెలిపారు. తన పేరుతో హైదరాబాద్​ నగరంలో రోడ్డును ఏర్పాటు చేయడం అపూర్వ గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్‌కు ఆనుకుని ఉన్న రోడ్డుకు “డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ” అని ఇటీవల పేరు పెట్టిన విషయం తెలిసిందే. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ రోడ్డును ప్రారంభించారు. దీంతో ట్రంప్​ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. దీనిని “అపూర్వ గౌరవం”గా అభివర్ణించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన చిత్రాన్ని పంచుకున్నారు. భారతదేశంలోని హైదరాబాద్‌లో కొత్త ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ ఈ విధంగా గౌరవించబడిన మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడు నేనే. ధన్యవాదాలు అని ట్రంప్​ పేర్కొన్నారు.

Donald Trump Avenue | పెట్టుబడులను ఆకర్షించడానికి..

Donald Trump Avenue

తెలంగాణ ప్రభుత్వం విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి పలు రోడ్ల పేర్లను మారుస్తామని గతంలో ప్రకటించింది. గూగుల్​, ఫేస్​బుక్​ పేరిట సైతం రోడ్లు ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఇందులో భాగంగా యూఎస్​ కాన్సులేట్​ పక్కన, అమెరికన్ టెక్ సంస్థల కార్యాలయాలకు సమీపంలో ఉన్న రోడ్డుకు డొనాల్డ్​ ట్రంప్​ అవెన్యూ అని పేరు పెట్టింది. ఇటీవలఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, భారత్‌లో యూఎస్ రాయబారి సెర్గియో గోర్‌లు లాంఛనప్రాయ రోడ్డు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

ఇది కూడా చదవండి..: Beijing Plane Crash | బీజింగ్‌లో కలకలం.. అత్యంత ఎత్తైన భవనాన్ని ఢీకొట్టిన చిన్న విమానం!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *