అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bhagyaraj Death | తమిళ చిత్రపరిశ్రమ (Tamil film industry)లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు, నటుడు భాగ్యరాజ్ (73) శనివారం ఉదయం మృతి చెందారు. ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన, పలు చిత్రాల్లో నటుడిగా సైతం మెప్పించారు. గుండెపోటుతో భాగ్యరాజ్ తుదిశ్వాస విడించారు.
భాగ్యరాజ్ (Bhagyaraj) తమిళ చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శకుడు, నటుడు, రచయిత, నిర్మాత. ఆయన 75కి పైగా చిత్రాలలో నటించారు. ప్రత్యేకమైన కథాంశాలు, హాస్యంతో కూడిన కుటుంబ కథా చిత్రాలను రూపొందించడంలో మంచి గుర్తింపు ఉంది. ఆయన మరణం పట్ల అభిమానులు, సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
Bhagyaraj Death | భారతీరాజా వద్ద..
భాగ్యరాజ్ 1953 జనవరి 7న ఈరోడ్ జిల్లాలోని గోబిచెట్టిపాళ్యం సమీపంలో ఉన్న వెల్లాన్కోవిల్లో జన్మించారు. తమిళ చలనచిత్ర పరిశ్రమలో నటుడిగా, డైలాగ్ రైటర్‌గా, దర్శకుడిగా, నిర్మాతగా పాత్రికేయుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఆయన రాణించారు. ఆయన మొదట ప్రముఖ దర్శకుడు భారతీరాజా వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. 1979లో ‘సువరిల్లాత చిత్తిరంగళ్’ (Suvarillatha Chithirangal) చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో గుండెపోటుతో ఆయన హఠాన్మరణం చెందారు.
Bhagyaraj Death | కింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లే
ఇండియన్ సినిమాలో భాగ్యరాజ్‌కు ‘కింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లే’ అనే పేరు ఉంది. ఆయన తెలుగులో నేరుగా తక్కువ సినిమాలు తీశారు. చిన్నోడు పెద్దొడు (1998), అమ్మాయి కోసం (2001) చిత్రాలను ఆయన తెలుగులో తెరకెక్కించారు. ‘పెళ్లైంది కానీ..’ మూవీకి సైతం దర్శకత్వం వహించారు. ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’, అబ్బాయిగారు మూవీలకు స్ట్కిప్ట్ అందించారు.
ఇది కూడా చదవండి..: NBK112 Movie Launch | బాలకృష్ణ-కొరటాల శివ సినిమా ప్రారంభం