అక్షరటుడే వెబ్‌డెస్క్: Sai Krishna Lockup Death | విజయవాడ ( Vijayawada ) కృష్ణలంక రాజీవ్‌నగర్‌కు చెందిన రౌడీషీటర్ గాదె సాయికృష్ణ అలియాస్ పిల్ల సాయి మృతి ఉదంతంపై సిట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. లాకప్‌లో సాయికృష్ణను చిత్రహింసలకు గురిచేసి చంపేసిన ఘటనలో, పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో సీఐ నాగరాజుకు సన్నిహితుడైన సురేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు.
Sai Krishna Lockup Death | సురేష్ అరెస్ట్ ..
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజుకు సురేష్ అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించినట్లు సిట్ గుర్తించింది. సాయికృష్ణ లాకప్‌లో మృతి చెందిన అనంతరం, మృతదేహాన్ని మాయం చేయడంలోనూ, ఆ తర్వాత కుటుంబ సభ్యులతో రాజీకి రాయబారం నడపడంలోనూ సురేష్ కీలకంగా వ్యవహరించాడని ప్రాథమిక విచారణలో తేలింది. సురేష్‌ను రహస్య ప్రాంతానికి తరలించి, పోలీసుల విధుల్లో అతడు ఎందుకు జోక్యం చేసుకున్నాడు? నాగరాజుతో అతడికి ఉన్న సంబంధాలు ఏమిటి? అనే అంశాలపై సిట్ అధికారులు లోతుగా ప్రశ్నిస్తున్నారు.
Sai Krishna Lockup Death | సెంట్రల్ డివిజన్ టాస్క్‌ఫోర్స్ రంగంలోకి ..
ఈ కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న హెడ్ కానిస్టేబుళ్లు అశోక్ , జంగం నాని అజ్ఞాతంలోకి వెళ్లారు. వారిని పట్టుకునేందుకు సెంట్రల్ డివిజన్ టాస్క్‌ఫోర్స్ రంగంలోకి దిగింది. వీరి కోసం ప్రత్యేక బృందాలు ఇప్పటికే హైదరాబాద్ , బెంగళూరు నగరాలకు చేరుకున్నాయి. అంతేకాకుండా, నిందితుల నివాసాల వద్ద నోటీసులు అంటించిన అధికారులు, వెంటనే విచారణకు హాజరుకావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
Sai Krishna Lockup Death | కఠిన చర్యలు తీసుకోవాలని..
ఈ ఘటనలో స్థానిక పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు రావడంతో, కేసులో ఇతరుల పాత్రపై కూడా దర్యాప్తు బృందం దృష్టి సారించింది. ఈ క్రమంలో సిట్ అధికారులు డీసీపీ కృష్ణకాంత్ పటేల్, టాస్క్‌ఫోర్స్ ఏడీసీపీ లతా కుమారి, ఏసీపీ మానసలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సాయికృష్ణ అరెస్టు సమయంలో జరిగిన పరిణామాలు , మృతుడి నేర చరిత్రపై కూడా సిట్ వివరాలు సేకరించింది. తల్లి విజయలక్ష్మి ఫిర్యాదుతో మొదలైన ఈ వివాదం, రోజుకో మలుపు తిరుగుతుండటంతో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం , ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Government School Admissions | ప్రైవేట్‌కు ధీటుగా ప్రభుత్వ బడి.. రికార్డు స్థాయిలో అడ్మిషన్లు..