అక్షరటుడే, వెబ్డెస్క్: Pregnant Suicide | మెదక్ జిల్లా (Medak District)లో అమానుష ఘటన చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో కడుపులో ఉన్న బిడ్డకు డీఎన్ఏ పరీక్ష చేయాలని ఓ భర్త వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఐదు నెలల గర్భిణీ ఆత్మహత్య చేసుకుంది.
వికారాబాద్ జిల్లా (Vikarabad District) కోటపల్లి మండలం మోత్కుపల్లికి చెందిన సుస్మిత (23)కు ఏడాదిన్నర క్రితం మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్‌కి చెందిన గాజుల అభిలాష్తో వివాహం జరిగింది. సుష్మిత ఇప్పుడు 5 నెలల గర్భిణీ. అయితే ఆమె గర్భానికి తాను కారణం కాదని అభిలాష్ అనుమానం పెంచుకున్నాడు. భార్యపై అనుమానంతో పుట్టబోయే బిడ్డకు డీఎన్ఏ పరీక్ష చేయాలని నిత్యం వేధించేవాడు. దీంతో ఇంట్లో గొడవలు జరిగేవి.
Pregnant Suicide | ఎవరు లేని సమయంలో..
భర్తతో పాటు అత్త సైతం సుష్మితను వేధించేది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న అల్లాదుర్గం పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. తన కూతురు మృతికి భర్త, అత్తలే కారణమని సుష్మిత తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Medak Tree Removal Dispute | విద్యుత్ వర్సెస్ ఫారెస్ట్ అధికారులు.. చెట్ల తొలగింపు అడ్డుకోవడంతో ఉద్రిక్తత