Pawan Kalyan Caste Remarks | క్రిమినల్​కు కులం అంటగడతారా.. పవన్​ ఆగ్రహం

ఏపీ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడు కుల రాజకీయాలు చేయలేదన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pawan Kalyan Caste Remarks | ఏపీ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడు కుల రాజకీయాలు చేయలేదన్నారు. తనను తిట్టేవాళ్లంతా కాపులేనని, ఎవరి భుజాల మీద పెట్టి కాలుస్తున్నారని ప్రశ్నించారు.

ఒక కుర్రాడు 14 ఏళ్ల బాలికను హింసిస్తే.. అలాంటి వాడికి వత్తాసుగా వెళ్తారా అని పవన్​ ప్రశ్నించారు. ఆ తల్లి పడే బాధ తనకు తెలుసన్నారు. కేవలం మీ కులమైతే సరిపోతుందా? ఓ క్రిమినల్‌ను ఎలా వెనకేసుకొస్తారు అని మండిపడ్డారు. కొంతమంది ప్రాంతీయతలను పట్టుకొచ్చి తనను తిడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇంకా తిడుతూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఒక్క కులం కోసమే పనిచేసే వ్యక్తిని కాదన్నారు.

Pawan Kalyan Caste Remarks | అందుకే 11 సీట్లు వచ్చాయి

Pawan Kalyan Caste Remarks

బూతులు తిట్టే లీడర్‌ని నమ్మినందుకు వైసీపీ 150 నుంచి 11 సీట్లకు పడిపోయిందని పవన్​ ఎద్దేవా చేశారు. అయినా ఇంకా వారు తీరు మార్చుకోలేదన్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఒక సీటు వస్తుందని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు సతీమణి గురించి గతంలో ఇష్టమొచ్చినట్టు మాట్లాడిన వైసీపీ నేతలు, ఇప్పుడు మహానుభావులు అయిపోయారా అన్నారు. ఎంతసేపూ బటన్ నొక్కాం.. డబ్బులు వేశాం అన్నారని, మరి రోడ్లు, స్కూల్స్ లాంటి బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంగతేంటి అని పవన్​ ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి..: Amaravati Political Tension | వైసీపీ వర్సెస్​ టీడీపీ.. అమరావతిలో ఉద్రిక్తత

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *