అక్షరటుడే, హైదరాబాద్: Police Insurance | విధి నిర్వహణలో అహర్నిశలు శ్రమించే పోలీస్ సిబ్బంది , వారి కుటుంబాల భద్రత కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) అద్భుతమైన బీమా సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ‘బరోడా పోలీస్ శాలరీ ప్యాకేజీ’లో భాగంగా కుదిరిన అవగాహన ఒప్పందం (MoA) ద్వారా పోలీస్ అధికారులకు, సిబ్బందికి భారీ ఆర్థిక రక్షణ లభించనుంది.
Police Insurance | బీమా ప్యాకేజీలోని కీలక ప్రయోజనాలు
బీమా పరిహారం: విధి నిర్వహణలో ఉండి ప్రమాదవశాత్తు మరణించిన పక్షంలో బాధితుడి కుటుంబానికి రూ.1.25 కోట్ల నుండి రూ.1.30 కోట్ల వరకు బీమా పరిహారం అందుతుంది.
శాశ్వత వైకల్యం : ప్రమాదాల కారణంగా శాశ్వత వైకల్యం బారిన పడితే ఆయా సిబ్బందికి రూ.80 లక్షల వరకు ఆర్థిక సాయం అందుతుంది.
సహజ మరణం: అనారోగ్యం లేదా ఇతర కారణాలతో సహజ మరణం పొందితే రూ.10 లక్షల వరకు బీమా వర్తిస్తుంది.
కార్డులపై అదనపు ప్రయోజనం: డెబిట్ , క్రెడిట్ కార్డుల వినియోగదారులకు అదనంగా ₹10 లక్షల నుండి ₹20 లక్షల వరకు ప్రత్యేక బీమా రక్షణ కల్పించారు.
పోలీసుల సామాజిక భద్రతకు పెద్దపీట వేస్తూ బ్యాంక్ ఆఫ్ బరోడా రూపొందించిన ఈ ప్యాకేజీపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. క్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వర్తించే సిబ్బందికి ఈ సమగ్ర బీమా రక్షణ ఒక పెద్ద భరోసాగా నిలవనుంది.
ఇది కూడా చదవండి..: Venue Night Edition | కొత్త ఫీచర్లు, స్టైలిష్ లుక్తో.. హ్యుందాయ్ వెన్యూ నైట్ ఎడిషన్ లాంచ్

