అక్షరటుడే, కామారెడ్డి: Awake Brain Surgery | బ్రెయిన్ ట్యూమర్ అంటేనే ఒకప్పుడు భయపడేవాళ్లని.. కానీ ప్రస్తుత టెక్నాలజీతో ఆ భయం పోయిందని, సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి సీనియర్ న్యూరో సర్జన్ బీజే రాజేష్ అన్నారు. కామారెడ్డి (Kamareddy) పట్టణంలోని యశోద బ్రాంచ్ క్లినిక్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
Awake Brain Surgery | గతంలో ట్యూమర్ అంటే పెద్ద రిస్క్..
గతంలో బ్రెయిన్ ఆపరేషన్ అంటే పెద్ద రిస్క్ అని, వందమందిలో 5 నుంచి 10 మంది ప్రాణాలు కోల్పోయేవారని వైద్యుడు రాజేష్ అన్నారు. కొందరికి చేతులు, కాళ్లు పక్షవాతానికి గురయ్యేవన్నారు. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. మెదడు చాలా సున్నితమైన ప్రాంతమని, అందుకే ఆపరేషన్ సమయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు. సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్లోనే ఎంఆర్ఐ సౌకర్యం ఉందని తెలిపారు. దీంతో సర్జరీ తర్వాత మెదడులో ఏమైనా కణితి మిగిలిపోతే వెంటనే గుర్తించవచ్చన్నారు. రోగికి పూర్తి మత్తు ఇవ్వకుండా మాట్లాడిస్తూనే బ్రెయిన్ సర్జరీ చేస్తున్నామన్నారు.
దీంతో రోగి పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయవచ్చని తెలిపారు. దేశంలో అత్యధిక బ్రెయిన్ ఆపరేషన్లు యశోద ఆస్పత్రిలోనే జరుగుతున్నాయని చెప్పారు. ఎండోస్కోప్ ద్వారా ముక్కు, కంటి మార్గం నుంచి కూడా కణితులను తొలగించే అవకాశం ఉంది. రోబోటిక్ సర్జరీ కూడా అందుబాటులోకి వచ్చిందన్నారు. సర్జరీ చేయించుకున్న కామారెడ్డి జిల్లా ప్రజలు తిరిగి సికింద్రాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదని ప్రతి నెల మొదటి గురువారం ఇక్కడి బ్రాంచ్‌లో అందుబాటులో ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Nizamabad to Bengaluru Bus | ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. నిజామాబాద్ టు బెంగళూరు ట్రిప్‌లో మరిన్ని సౌకర్యాలు..