అక్షరటుడే, వెబ్డెస్క్ : Telangana Heavy Rains | వానలు లేక ఆందోళన చెందుతున్న రైతులకు వాతావరణ శాఖ గుడ్న్యూస్ చెప్పింది. నేటి నుంచి ఈ నెల 5 వరకు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని పేర్కొంది.
వానాకాలం ప్రారంభమై నెల దాటుతున్నా.. తెలంగాణలో చెప్పుకోదగ్గ వర్షాలు పడలేదు. దీంతో సాగు పనులు మందకొడిగా సాగున్నాయి. శుక్రవారం నుంచి ఆదివారం వరకు తెలంగాణ (Telangana) వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఈ సీజన్లో తొలిసారి ముసురు పెడుతుందని పేర్కొన్నారు.
Telangana Heavy Rains | ఆ జిల్లాలకు అలెర్ట్

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 100 నుంచి 120 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉంది. నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. 50 నుంచి 80 మి.మీ. వర్షం కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉమ్మడి మెదక్, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మల్కాజ్గిరి, భువనగిరి, వికారాబాద్, నారాయణపేట్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడుతాయి. మిగతా జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయి.
ఇది కూడా చదవండి..: Telangana Cabinet Decisions | కేబినెట్ కీలక నిర్ణయం.. ఇకపై ఉపాధ్యాయులకూ మధ్యాహ్న భోజనం