అక్షరటుడే వెబ్‌డెస్క్: Modi Semiconductor Hub | గుజరాత్‌లోని సనంద్‌లో ‘CG సెమీ’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక అవుట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ (OSAT) కేంద్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న యువతీ యువకులతో ఆయన ముచ్చటించారు. తమ ప్రాంతాల నుంచి బయటకు వచ్చి, దేశ సాంకేతిక ప్రగతిలో భాగస్వాములవుతున్న యువశక్తిని చూసి గర్విస్తున్నానని ప్రధాని కొనియాడారు.
Modi Semiconductor Hub | యువశక్తిపై ప్రధాని ప్రశంసలు
ఈ పర్యటనకు సంబంధించిన వీడియోను ప్రధాని మోదీ తాజాగా తన ‘X’ ఖాతాలో పంచుకున్నారు. “ఇక్కడ చాలా మంది యువతులు పని చేస్తున్నారు. వీరంతా దేశంలోని మారుమూల ప్రాంతాలు, గిరిజన నేపథ్యం నుంచి వచ్చిన వారు. సెమీకండక్టర్ తయారీ ప్రస్థానానికి వీరు గొప్ప బలాన్ని చేకూరుస్తున్నారు. మన యువశక్తిని చూస్తుంటే గర్వంగా ఉంది” అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా, ఒక చిన్న గ్రామం నుండి వచ్చి, ఆ గ్రామం దాటి బయటకు వచ్చిన తొలి మహిళగా తన ప్రయాణాన్ని ఒక యువతి ప్రధాని మోదీకి వివరించింది. అసాధారణ పరిస్థితులను అధిగమించి, నేడు సెమీకండక్టర్ పరిశ్రమలో కీలక పాత్ర పోషిస్తున్న ఆమె కథనం అక్కడి వారందరినీ ఆకట్టుకుంది.
Modi Semiconductor Hub | నవ భారత నిర్మాణంలో కీలక మైలురాయి..
భారతదేశాన్ని గ్లోబల్ సెమీకండక్టర్ హబ్‌గా మార్చాలన్న ప్రధాని మోదీ దూరదృష్టి క్షేత్రస్థాయిలో అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని రాంచందర్ రావు కొనియాడారు. నగరాలకే పరిమితం కాకుండా, మారుమూల ప్రాంతాల యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, వారిని సాంకేతిక నిపుణులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ విధానాలు, యువత ఆకాంక్షలకు కొత్త ఊపిరి పోస్తున్నాయని ఈ ఘటన మరోసారి నిరూపించిందని ఆయన తన పోస్ట్‌లో స్పష్టం చేశారు.
ఒక చిన్న గ్రామానికి చెందిన యువతి, తన గ్రామం నుంచి బయటకు వచ్చి తన భవిష్యత్తును నిర్మించుకున్న తొలి అమ్మాయిగా తాను ఎలా ఎదిగానో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి వివరించింది.
నేడు ఆమెలాంటి అనేక మంది యువతులు భారతదేశ సెమీకండక్టర్ పరిశ్రమ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
నవ… pic.twitter.com/BpS7ZJMj9U
— N Ramchander Rao (@N_RamchanderRao) July 5, 2026
ఇది కూడా చదవండి: SIR Registration | మహిధర లక్సూరియా విల్లా కమ్యూనిటీలో ఎస్ఐఆర్ నమోదు