Trump Iran Remarks | ఒక్క షాట్​తో అందరిని లేపేయగలం.. ఇరాన్​ నాయకత్వంపై ట్రంప్​ వ్యాఖ్యలు

ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొన్న ఇరాన్​ నాయకత్వాన్ని ఒక్క దెబ్బతో తాము అంతం చేయగలమని డోనాల్డ్​ ట్రంప్​ అన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Trump Iran Remarks | ఇరాన్ నాయకత్వంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్ (Donald Trump) మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక్క దెబ్బతోనే ఇరాన్ నేతలను అంతమొందించగలం అన్నారు. అయితే తాము అలా చేయమన్నారు.

ఒక ఇంటర్వ్యూలో ట్రంప్​ మాట్లాడుతూ.. వేలాది మంది ఇరానీయులు ఖమేనీ మరణానికి సంతాపం తెలపడం చూసి తాను ఆశ్చర్యపోయానని ట్రంప్ తెలిపారు. ప్రజలు ఖమేనీని ద్వేషిస్తారని నేను అనుకున్నాను. బహుశా ఇవి నకిలీ కన్నీళ్లు కావచ్చు అన్నారు. తాను కోరుకుంటే ఒక్క దెబ్బతో ఇరాన్‌లోని మిగిలిన నాయకత్వాన్ని అమెరికా నిర్మూలించగలదని, అయితే టెహ్రాన్‌తో దౌత్య సంబంధాలు కొనసాగాలని కోరుకుంటున్నందున వాషింగ్టన్ అలా చేయదన్నారు. వారందరూ అక్కడే ఉన్నారు. ఒక్క దెబ్బతో, మనం వారందరినీ ఏరివేయగలం. కానీ మనం అలా చేయబోం, ఎందుకంటే అప్పుడు మనం చర్చలు జరపడానికి ఎవరూ ఉండరు అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

Trump Iran Remarks | వారం టైమ్​ ఇచ్చాం

ఇరాన్‌తో అణు చర్చలు కొనసాగాలన్న ఉద్దేశంతోనే అలాంటి చర్యలకు దిగలేదని ట్రంప్​ తెలిపారు. ఇరాన్‌ను తీవ్రంగా దెబ్బ తీశామన్నారు. ఇప్పుడు వారు ఒప్పందం చేసుకోవాలని ఆత్రుతగా ఉన్నారని పేర్కొన్నారు. అంత్యక్రియలు నిర్వహించుకునేందుకు తామే వారికి వారం రోజుల టైమ్ ఇచ్చామని ట్రంప్ అన్నారు.

Trump Iran Remarks | ఇరాన్​ ఆగ్రహం

మాజీ సర్వోన్నత నాయకుడు అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరైన దేశ అగ్ర నాయకత్వాన్ని “ఒకే దెబ్బతో” తుడిచిపెట్టగలనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ ఆదివారం తీవ్రంగా విరుచుకుపడింది. జూలై 4న తన స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవాన్ని జరుపుకున్న అమెరికాకు “నాగరికత, చరిత్ర, గౌరవం లేవు” కాబట్టి ఖమేనీ మరణంపై వెల్లువెత్తిన దుఃఖాన్ని అది ఎప్పటికీ అర్థం చేసుకోలేదని పేర్కొంది. “ప్రజలను చంపవచ్చు, కానీ ఆదర్శాలను చంపలేరు. మీరు అయతొల్లా ఖమేనీని చంపారు, కానీ వాస్తవానికి, మీరు ఒక పరిమళ ద్రవ్య సీసాను పగలగొట్టారు, దాని సువాసన నలుదిక్కులా వ్యాపించింది,” అని దివంగత నాయకుడి అంత్యక్రియలకు తరలివచ్చిన భారీ జనసమూహాన్ని ఉద్దేశించి రాయబార కార్యాలయం పేర్కొంది.

Trump Iran Remarks | కొనసాగుతున్న అంత్యక్రియలు

ప్రస్తుతం ఖమేనీ పార్థివ దేహాన్ని టెహ్రాన్‌లో ప్రజల సందర్శనార్థం ఉంచారు. అక్కడ సంతాపకులు, విదేశీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. మాజీ సుప్రీం లీడర్ పార్థివ దేహాన్ని, టెహ్రాన్, ఖోమ్, నజఫ్, కర్బలాల మీదుగా వారం రోజుల పాటు జరిగే అంత్యక్రియల ఊరేగింపు అనంతరం, జూలై 9న మషద్‌లో ఖననం చేయనున్నారు.

దీనిని కూడా చదవండి : Khamenei Funeral | ఖమేనీ అంత్యక్రియలకు అపార జనసందోహం.. 3 వేల సమాధుల ఏర్పాటుపై చర్చ.. అసలు కారణమేంటి?

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *