8th Pay Commission Salary | కనీస వేతనం రూ. 72 వేలు.. 8వ వేతన సంఘానికి బీపీఎంఎస్ ప్రతిపాదన!

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: 8th Pay Commission Salary| కేంద్ర ప్రభుత్వ (Central Government) ఉద్యోగులు, పెన్షనర్లు ఎనిమిదో వేతన సంఘం అమలు కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వేతన కమిషన్‌కు అన్ని ట్రేడ్ యూనియన్లు తమ ప్రతిపాదనలను పంపిస్తున్నాయి.

తాజాగా భారతీయ మజ్దూర్ సంఘ్ అనుబంధ ట్రేడ్ యూనియన్ భారతీయ ప్రతిరక్ష మజ్దూర్ సంఘ్ (బీపీఎంఎస్ ) కీలక ప్రతిపాదనలను పంపించింది. ఉద్యోగుల శాలరీ స్ట్రక్చర్‌లో మార్పులు, ఇతర అలవెన్సులు ఎలా ఉండాలన్న విషయమై వినతిపత్రం సమర్పించింది.

8th Pay Commission Salary | తలసరి నికర జాతీయ ఆదాయానికి తగ్గట్లుగా…

ఉద్యోగుల కనీస వేతనం రూ. 72 వేలుగా ఉండాలని బీపీఎంఎస్ సూచించింది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 4 కు చేర్చాలని డిమాండ్ చేసింది. ఏడో వేతన కమిషన్‌లో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 గా ఉంది. దాని ప్రకారం మినిమం బేసిక్ పే రూ. 18 వేలుగా ఉండగా.. బీపీఎంఎస్ డిమాండ్ చేస్తున్న కొత్త ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ను అమలు చేస్తే కనీస వేతం రూ. 72 వేలకు చేరుతుంది. ఇక యాన్యువల్ ఇంక్రిమెంట్ 6 శాతంగా ఉండాలని బీపీఎంఎస్ (BPMS)  ప్రతిపాదించింది. అంతకుముందు 7వ వేతన సంఘం కింద 3 శాతంగా ఉండేది. గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ ప్రచురించిన డేటాను ఉదహరిస్తూ బీపీఎంఎస్ ఈ ప్రతిపాదనలు చేసింది. ఆ డేటా ప్రకారం దేశ తలసరి నికర జాతీయ ఆదాయం 2016 -17 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,03,219గా ఉండగా.. 2024 -25 నాటికి 86 శాతానికిపైగా పెరిగి రూ. 1,92,774 లకు చేరింది. దానికి తగ్గట్లుగానే ఉద్యోగులకు వేతనాలు పెరగాల్సి ఉందన్న అభిప్రాయాన్ని బీపీఎంఎస్ వ్యక్తం చేసింది.

8th Pay Commission Salary | ఎన్సీ -జేసీఎం ప్రతిపాదనలు ఇలా..

కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య వివాదాల్ని పరిష్కరించే వేదిక అయిన నేషనల్ కౌన్సిల్- జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ(ఎన్సీ -జేసీఎం) కూడా తన ప్రతిపాదనలను కమిషన్ ముందు ఉంచింది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 3.83 గా ఉండాలని.. కనీస వేతనం రూ. 69 వేలకు చేరాల్సి ఉంటుందని పేర్కొంది. వార్షిక వేతన పెంపు 6 శాతంగా ఉండాలని.. పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరించాలని కోరింది. కాగా ఇప్పటివరకు, 8వ పే కమిషన్ కింద ప్రభుత్వం ఎలాంటి తుది వేతన నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఉద్యోగుల ప్రతినిధులు, విభాగాలు మరియు భాగస్వాములతో సంప్రదింపుల తర్వాత సిఫార్సులు సిద్ధం చేస్తారు.

ఇది కూడా చదవండి..: Panchkula Scam Probe | పంచకులా మున్సిపల్ కార్పొరేషన్​లో రూ.145 కోట్ల నిధుల దుర్వినియోగం.. విచారణ చేపట్టిన ఈడీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *