అక్షరటుడే, అమరావతి : AP Assembly | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో మరో కీలక ఘట్టానికి వేదిక సిద్ధమవుతోంది. త్వరలోనే శాసనసభ ప్రత్యేక సమావేశాలను నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ప్రకటించారు. కూటమి నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు.
AP Assembly | మహిళా రిజర్వేషన్ బిల్లు:
పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు (Women’s Reservation Bill)ను కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించడంపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాలని సీఎం నిర్ణయించారు. మహిళల సాధికారతకు అడ్డుపడుతున్న పార్టీల అసలు రంగును అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించాలని కూటమి నేతలకు చంద్రబాబు సూచించారు. వచ్చే 10 రోజుల్లోనే ఈ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం.
ఇది కూడా చదవండి..: Power Reforms | విద్యుత్ రంగంలో భారీ సంస్కరణలు.. 300 మెగావాట్లకు పైగా అవసరమున్న ప్రైవేట్ కంపెనీలకు లైసెన్స్ అనుమతి

