అక్షరటుడే, వెబ్‌డెస్క్: ORR Blackspots | హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ (ORR) పై తరచుగా చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అధికారులు కీలక చర్యలు చేపట్టారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించారు. ఇలా గుర్తించిన మొత్తం 80 బ్లాక్‌స్పాట్స్‌పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నారు.
ఈ బ్లాక్‌స్పాట్స్ వద్ద ట్రాఫిక్ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించడంతో పాటు, నిబంధనలు ఉల్లంఘిస్తూ రోడ్డుపై వాహనాలను పార్క్ చేస్తున్న వారిని వెంటనే గుర్తించి ఎన్ఫోర్స్మెంట్ బృందాల ద్వారా చర్యలు తీసుకోనున్నారు.
BSNL Satellite Phone | నెట్వర్క్ లేకున్నా కాల్స్.. బీఎస్ఎన్ఎల్ నుంచి శాటిలైట్ ఫోన్ అందుబాటులోకి
ORR Blackspots | బ్రేక్‌డౌన్ వాహనాల తొలగింపునకు బృందాలు..
సాంకేతిక లోపాలతో మధ్యలో నిలిచిపోయే లేదా బ్రేక్‌డౌన్‌కు గురయ్యే వాహనాలను వెంటనే తొలగించేందుకు ప్రత్యేక రికవరీ బృందాలు, టోవింగ్ వాహనాలను అందుబాటులో ఉంచుతున్నారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూడటంతో పాటు, ద్వితీయ ప్రమాదాల అవకాశాలను తగ్గించాలనే లక్ష్యంతో ఈ చర్యలు చేపడుతున్నారు.
రోడ్డు భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ORRపై ప్రయాణించే వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, అత్యవసర పరిస్థితులు మినహా రోడ్డుపై వాహనాలను నిలిపివేయవద్దని అధికారులు సూచించారు. ఈ చర్యలతో ORRపై ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.