Duplicate Voter ID |  రెండు చోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు..

ఎస్​ఐఆర్​ ప్రక్రియ అనంతరం ఎవరికైనా రెండు చోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు శిక్ష విధిస్తామని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Duplicate Voter ID | ఎస్​ఐఆర్​ ప్రక్రియ అనంతరం ఎవరికైనా రెండు చోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు శిక్ష విధిస్తామని తెలంగాణ (Telangana) ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఉద్దేశపూర్వకంగా రెండు ఓట్లు ఉంటే శిక్ష, జరిమానా విధిస్తామన్నారు.

రాష్ట్రంలో ఎస్​ఐఆర్​ ప్రక్రియ కొనసాగుతోంది. ఓటర్లు ఎన్యుమరేషన్​ ఫారాలను నింపి బీఎల్​వోలకు అందిస్తున్నారు. వాటిని బీఎల్​వోలు ఆన్​లైన్​లో అప్​డేట్ చేస్తున్నారు. అయితే కొందరికి ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓట్లు ఉన్నాయి. నగరాలకు వలస వెళ్లిన వారికి అక్కడ ఓటు ఉండగా.. సొంత గ్రామంలో కూడా ఓటు ఉన్న ఘటనలు ఉన్నాయి. అంతేగాకుండా పలువురు ఒకే ప్రాంతంలో రెండు, మూడు ఓట్లు కలిగి ఉన్నారు.

Duplicate Voter ID | విచారణ జరిపి చర్యలు

Duplicate Voter ID

ఎస్​ఐఆర్​ అనంతరం రాష్ట్రంలో ఎవరికైనా రెండు చోట్ల ఓటు ఉంటే రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తిస్తుంది. రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉంటే కేంద్ర ఎన్నికల సంఘం గుర్తిస్తుంది. దీనికోసం ఈసీ ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఒకరికి రెండు, మూడు ఓట్లు ఉన్నట్లు గుర్తిస్తే విచారణ జరిపి అధికారులు చర్యలు తీసుకుంటారు. ప్రస్తుతం ఎన్ని ఓట్లు అన్ని ఎన్యుమరేషన్​ ఫారాలు అందించారు. ఓటర్లు తాము నివాసం ఉండే ప్రాంతంలో ఉన్న ఓటుకు సంబంధించిన ఫారాన్ని మాత్రమే నింపి బీఎల్​వోలకు ఇవ్వాలి. అలా కాంకుడా కావాలని రెండు ఫారాలు నింపి ఇస్తే అధికారులు చర్యలు తీసుకోనున్నారు.

ఇది కూడా చదవండి..: Telangana Heat Wave | మండుతున్న ఎండలు.. ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *