అక్షరటుడే, వెబ్‌డెస్క్ : S Janaki Death | ప్రముఖ సింగర్, దక్షిణ భారత నైటింగేల్‌గా ప్రసిద్ధి చెందిన ఎస్. జానకి 88 ఏళ్ల వయసులో కన్నుమూశారు. అనారోగ్య కారణంతో ఆమె మైసూర్ (Mysore)లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. అయితే చికిత్స పొందుతూనే ఆమె తుదిశ్వాస విడిచారు. గుండెపోటు కారణంగా ఆమె మరణించినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు (Gunturu) జిల్లా రేపల్లె గ్రామంలో 1938 ఏప్రిల్ 23న జానకి జన్మించారు. మూడేళ్ల వయసులోనే నాదస్వర విద్వాంసుడు పైడిస్వామి వద్ద సంగీత శిక్షణ ప్రారంభించారు. అనంతరం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో సహా 20కి పైగా భాషలలో 48 వేలకు పైగా పాటలు పాడారు.
S Janaki Death | ఆ సినిమాతో ప్రారంభం
ప్రముఖ సంగీత దర్శకుడు చలపతిరావు 1957లో స్వరకల్పన చేసిన ‘విధియిన్ విలయాట్టు’ అనే తమిళ చిత్రంతో ఆమె సినీరంగంలో అడుగుపెట్టారు. ఆ తర్వాత తెలుగులో ‘ఎం.ఎల్.ఏ.’, కన్నడలో ‘కృష్ణగరుడి’ వంటి చిత్రాల్లో పాటలు పాడారు. మలయాళ చిత్రాలలో కూడా ఆమె పాడటం మొదలుపెట్టారు. ఆమె దక్షిణ భారతదేశంలోని అన్ని ప్రధాన భాషలలో గాయనిగా గుర్తింపు పొందారు. హిందీతో సహా అనేక భారతీయ భాషలలో ఆమె తన గానాన్ని వినిపించారు.
S Janaki Death | అనేక అవార్డులు
ఎస్. జానకి అనేక జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులను అందుకున్నారు. మైసూర్ విశ్వవిద్యాలయం ఆమెను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. ఇటీవల భారత ప్రభుత్వం ఆమెకు ‘పద్మభూషణ్’ అవార్డును ప్రకటించింది. అయితే ఆమె ఆ అవార్డును తిరస్కరించారు.
దీనిని కూడా చదవండి : Medigadda Collapse | కేసీఆర్ నిర్లక్ష్యంతోనే మేడిగడ్డ కూలింది : సీఎం రేవంత్‌రెడ్డి