అక్షరటుడే వెబ్‌డెస్క్: Pawan Kalyan Health | ముంబయిలో చికిత్స పొందుతున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. అక్కడ కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పవన్‌ను కలిసి, ఆయన ఆరోగ్య వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా సీఎం ఆకాంక్షించారు.
Pawan Kalyan Health | పవన్‌కు భుజం శస్త్రచికిత్స..
పవన్ కల్యాణ్ కుడి భుజానికి సంబంధించి డాక్టర్ దిన్షా పార్థీవాలా నేతృత్వంలోని వైద్యుల బృందం శనివారం విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించింది. రొటేటర్ కఫ్ గాయంతో పాటు భుజానికి ‘అవల్షన్ ఫ్రాక్చర్’ ఉండటంతో ఈ ఆపరేషన్ అవసరమైందని వైద్యులు తెలిపారు. భవిష్యత్తులో ఎడమ భుజానికి కూడా మరో శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
Pawan Kalyan Health | మజిల్ టేర్స్ ఉన్నట్లు..
గత ఏప్రిల్‌లో ముక్కుకు శస్త్రచికిత్స చేయించుకున్న సమయంలోనే, వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో పవన్ భుజాలకు తీవ్రస్థాయిలో కండరాల గాయాలు (మజిల్ టేర్స్) ఉన్నట్లు గుర్తించారు. దీనివల్ల త్వరగా ఆపరేషన్ చేయించుకోవాలని అప్పట్లోనే వైద్యులు సూచించడంతో, పవన్ కల్యాణ్ ముంబయి వెళ్లి చికిత్స తీసుకుంటున్నారు.
#Maharashtra ముంబయిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తన కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న #PawanKalyan ను #ApCm నారా #ChandraBabu నాయుడు పరామర్శించారు. pic.twitter.com/PYwYDJBgfT
— Akshara Today | Telugu News (@aksharatoday) July 12, 2026
ఇది కూడా చదవండి: Vijayawada Bus Fire | విజయవాడలో అగ్ని ప్రమాదం.. ఏడు బస్సులు దగ్ధం