తెలంగాణKharif Season | వానాకాలం సీజన్​పై మంత్రి తుమ్మల సమీక్ష

Kharif Season | వానాకాలం సీజన్​పై మంత్రి తుమ్మల సమీక్ష

వానాకాలం పంట సీజన్​పై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధ్యక్షతన శుక్రవారం సమావేశం నిర్వహించారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kharif Season | వానాకాలం పంట సీజన్​పై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Thummala Nageswara Rao) అధ్యక్షతన, రైతు కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు ముఖ్య అంశాలపై చర్చించారు.

వానాకాలం సీజన్​ కోసం వరి (Paddy) విత్తనాల అవసరం, సరఫరా, అలాగే పంటల మార్పిడి (Crop Diversification)పై చర్చించారు. సుమారు 10.80 లక్షల ఎకరాలకు అవసరం అయ్యేలా వరి విత్తనాల ప్రణాళికను రూపొందించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించబడే రైతు వారోత్సవం కార్యక్రమాలపై చర్చించారు. ఈ కార్యక్రమం మే 4 నుంచి 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారు.

Kharif Season | రైతులకు అవగాహన

వారోత్సవాల్లో భాగంగా నేల ఆరోగ్యం, సమతుల్య ఎరువుల వినియోగం, సహజ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. ఉద్యాన పంటలు, ఆయిల్ పామ్ విస్తరణ, ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రోత్సాహం కోసం కృషి చేస్తారు. పంట రుణాలు, సహకార సంఘాలు, మార్కెటింగ్ అవకాశాలు, సౌరశక్తి, యాంత్రీకరణ, డ్రోన్లు తదితర అంశాలపై రైతులకు వివరించారు. ఈ సమావేశంలో రాములు నాయక్, భవాని మరికంటి, సునీల్, గడుగు గంగాధర్, రాంరెడ్డి గోపాల్ పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి : Narsampet Tension | నర్సంపేట డిపో వద్ద తీవ్ర ఉద్రిక్తత.. రంగంలోకి బండి సంజయ్

 

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....