Indian Stock Market | నష్టాల్లో దేశీయ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం ఒడిదుడుకుల మధ్య నష్టాలతో సాగుతోంది. ఉదయం 11.15 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 260 పాయింట్లు, నిఫ్టీ 70 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indian Stock Market | పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా వరుసగా మూడో రాత్రి కూడా దాడులు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతోపాటు హార్ముజ్ జలసంధిలో ఇరాన్ వాణిజ్యంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కొత్తగా దిగ్బంధనాన్ని ప్రకటించడంతో ముడి చమురు ధరలకు రెక్కలు వస్తున్నాయి. ఇది మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తోంది.

Indian Stock Market | పెరిగిన ద్రవ్యోల్బణంతో ఆందోళన..

భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం జూన్‌లో 4.38 శాతానికి పెరిగింది. ఇది జనవరి 2025 తర్వాత మొదటిసారిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన 4 శాతం మధ్యస్థ లక్ష్యాన్ని అధిగమించింది. పెట్రోల్, డీజిల్ ధరలు, ఆహార పదార్థాల ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం పెరిగింది. ద్రవ్యోల్బణం పెరుగుదల ద్రవ్య విధానాన్ని కఠినతరం చేయడానికి దారితీస్తుందని, ఇది మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తుందని మార్కెట్ వర్గాలు భయపడుతున్నాయి.

Indian Stock Market | భారీ నష్టాలతో ప్రారంభమై..

Indian Stock Market

దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 344 పాయింట్ల నష్టంతో ప్రారంభమైనా తర్వాత కోలుకుని 130 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 401 పాయింట్లు పడిపోయింది. 143 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన నిఫ్టీ.. 89 పాయింట్లు పెరిగినా నిలదొక్కుకోలేకపోయింది. అక్కడినుంచి 119 పాయింట్లు నష్టపోయింది. ఉదయం 11.15 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 260 పాయింట్ల నష్టంతో 77,355 వద్ద, నిఫ్టీ 70 పాయింట్ల నష్టంతో 24,140 వద్ద ఉన్నాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 8 స్టాక్స్ లాభాలతో, 22 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఎయిర్‌టెల్ 1.73 శాతం, టాటా స్టీల్ 1.34 శాతం, అదానీపోర్ట్స్ 1.12 శాతం, టీసీఎస్ 1.01 శాతం, రిలయన్స్ 0.56 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : హెచ్సీఎల్ టెక్ 2.90 శాతం, ఇండిగో 2.52 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.99 శాతం, ఎం అండ్ ఎం 1.58 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 1.56 శాతం నష్టాలతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: July 14 Gold Prices | భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఒక్కరోజులోనే బంగారంపై రూ.1,900, వెండిపై రూ.5,300 తగ్గుదల

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *