Gold Rates May 2026 | అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావం.. రికార్డు స్థాయికి చేరిన బంగారం ధరలు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gold Rates May 2026 | అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఆర్థిక మార్కెట్లలో మారుతున్న పరిస్థితుల ప్రభావంతో దేశవ్యాప్తంగా బంగారం ధరలు (Gold Rates) మళ్లీ భారీ ఎత్తున పెరిగాయి. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు క్రమంగా తొలగిపోతున్నాయన్న సంకేతాలు, రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలపై వస్తున్న వార్తలు బంగారం మార్కెట్‌ను ప్రభావితం చేశాయి.

దీంతో పెట్టుబడిదారులు మళ్లీ పసిడివైపు మొగ్గుచూపడంతో ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. భారత మార్కెట్లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,52,140 వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,39,460గా నమోదైంది. వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తూ భారీ ధరను నమోదు చేసింది. ప్రస్తుతం గ్రాము వెండి ధర రూ.265.10 ఉండగా.. కిలో వెండి ధర (Silver Price) రూ.2,65,100గా ఉంది.

Gold Rates May 2026 | హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ నగరంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,52,140గా ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,39,460గా నమోదైంది. ఇక వెండి కిలో ధర రూ.2,75,100 వద్ద కొనసాగుతోంది.విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కూడా హైదరాబాద్ (Hyderabad) తరహాలోనే ధరలు కొనసాగుతున్నాయి.24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,52,140 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,39,460గా ఉంది. ఇక వెండి కిలో రూ.2,75,100గా న‌మోదైంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో Delhi బంగారం ధరలు మరింత పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,52,290 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,39,610గా న‌మోదైంది.ఇక వెండి కిలో రూ.2,65,100గా ట్రేడ్ అయింది.

ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు – రూ.1,52,140 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు – రూ.1,39,460, వెండి కిలో – రూ.2,65,100గా ఉంది. చెన్నైలో దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే బంగారం ధరలు మరింత ఎక్కువగా నమోదయ్యాయి.24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు – రూ.1,53,830 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు – రూ.1,41,010,వెండి Silver కిలో – రూ.2,75,100గా ఉంది. ఇక బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు – రూ.1,49,170, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు – రూ.1,36,740, వెండి కిలో – రూ.2,65,100గా ట్రేడ్ అయింది.

కోల్‌కత్తాలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు – రూ.1,52,140, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు – రూ.1,39,460, వెండి కిలో – రూ.2,65,100గా ఉంది. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడం, అమెరికా డాలర్ విలువ బలహీనపడటం పసిడికి మద్దతుగా మారాయి. అదేవిధంగా వాషింగ్టన్-టెహ్రాన్ మధ్య యుద్ధ పరిస్థితులను తగ్గించేందుకు “వన్ పేజ్ మెమో” రూపంలో ఒక ప్రాథమిక ఒప్పందం సిద్ధమవుతోందన్న వార్తలు మార్కెట్‌లో కొత్త ఆశలు రేకెత్తించాయి.ఇరాన్ కీలకమైన హార్ముజ్ జలసంధి (Strait of Hormuz)ని తిరిగి తెరవనున్నట్లు ప్రకటించడం కూడా అంతర్జాతీయ వాణిజ్య మార్కెట్లపై ప్రభావం చూపింది.

ఇది కూడా చదవండి..: May 07 Market Analysis | నెగెటివ్​గా గిఫ్ట్ నిఫ్టీ.. నష్టాల్లో ప్రారంభంకానున్న దేశీయ మార్కెట్లు!

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *