Parawada Pharma Fire | పరవాడ ఫార్మాసిటీలో మరో అగ్నిప్రమాదం

అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Parawada Pharma Fire | అనకాపల్లి జిల్లా (Anakapalli District) పరవాడ ఫార్మాసిటీలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నెహ్రూ ఫార్మాసిటీలోని సాయి చందన కంపెనీలో రియాక్టర్ పేలి భారీ అగ్నిప్రమాదం జరిగింది.

పరవాడ ఫార్మాసిటీలో మూడు రోజులుగా నిత్యం ప్రమాదాలు జరుగుతుండటంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. సోమవారం ఒక కంపెనీలో, మంగళవారం మరో కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. తాజాగా సాయిచందన కంపెనీలో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో కంపెనీలో 40 మంది కార్మికులు ఉన్నారు. అయితే అందరు సురక్షితంగా బయట పడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Parawada Pharma Fire | కేసు నమోదు

ఫార్మాసిటీలో మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదంలో పలువురు కార్మికులు గాయపడ్డారు. తాజాగా సాయిచందన ప్రైవేట్ లిమిటెడ్ ప్రొడక్షన్ బ్లాక్ -రియాక్టర్ వద్ద కెమికల్ లీకవ్వడంతో మంటలు వ్యాపించినట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి వేశారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా వరుస ప్రమాదాలతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇది కూడా చదవండి..:  Mudragada Padmanabham | ముద్రగడ పద్మనాభం కన్నుమూత

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *