Madhapur Murder Case | ప్రేమ వ్యవహారం.. మాదాపూర్‌లో యువకుడి దారుణ హత్య

హైదరాబాద్​ నగరంలోని మాదాపూర్​లో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Madhapur Murder Case | హైదరాబాద్​ (Hyderabad) నగరంలోని మాదాపూర్​లో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడిని వరంగల్​ జిల్లాకు చెందిన భాస్కర్​గా గుర్తించారు.

వరంగల్ జిల్లా మాదన్నపేట్ మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన భాస్కర్‌గా మాదాపూర్​లోని ఓ హోటల్​లో కుక్​గా పని చేస్తున్నాడు. అతడు ఉప్పరపల్లికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. కులాలు వేరు కావడంతో అమ్మాయి తల్లిదండ్రులు వేరే యువకుడితో ఆమెకు వివాహం జరిపించారు. పెళ్లి తర్వాత ఆ అమ్మాయికి భర్తతో గొడవలు అయ్యాయి. దీంతో ఆమెకు భర్త విడాకులు ఇచ్చాడు. విడాకులకు తన కుమార్తెను ప్రేమించిన భాస్కర్​ కారణమని ఆమె తండ్రి రాజు కక్ష పెంచుకున్నాడు.

Madhapur Murder Case | కత్తులతో పొడిచి..

హైదరాబాద్​లోని అయ్యప్ప సొసైటీలోని ఓ హాస్టల్​లో ఉంటున్న భాస్కర్​ వద్దకు మంగళవారం రాత్రి ఐదుగురు వచ్చారు. అతడికి హాస్టల్​ నుంచి బయటకు తీసుకు వచ్చి విచక్షణరహితంగా దాడి చేశారు. కత్తులతో పొడిచి చంపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు పోలీస్​ స్టేషన్​లో లొంగిపోయినట్లు సమాచారం.

ఇది కూడా చదవండి..: Gandhi Medical College Vice Principal | గాంధీ మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్‌గా డాక్టర్ బి.వి. నాగమోహన్ రావు నియామకం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *