అక్షరటుడే, ఇందూరు: CMR Targets | జిల్లాలో సీఎంఆర్ లక్ష్యాలను పూర్తిచేయాలని.. రైస్‌మిల్లర్లు సీఎంఆర్ సరఫరాలను వేగవంతం చేయాలని సివిల్ సప్లయిస్ డైరెక్టర్ సత్యనారాయణ పేర్కొన్నారు. కలెక్టరేట్ (Collectorate)లో బుధవారం సివిల్ సప్లయ్ శాఖ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు, రైస్‌మిల్లర్స్ అసోసియేషన్లతో ఆయన సమీక్ష నిర్వహించారు.
CMR Targets | సరఫరాపై ఆరా..!
సివిల్ సప్లయిస్ డైరెక్టర్ మాట్లాడుతూ.. రైస్‌మిల్లర్లు ఎఫ్‌సీఐకి కస్టమ్ మిల్డ్ రైస్ (సీఎంఆర్) సరఫరా చేస్తున్న పురోగతిపై ఆరా తీశారు. రబీ 2022-23 ధాన్యం వేలం విక్రయాల ఆదాయం జమ చేయడంపై ఆయన అధికారులతో చర్చించారు. ఎఫ్‌సీఐ (FCI) గోదాముల్లో నిల్వ స్థలం లభ్యత, సీఎంఆర్ సరఫరాపై మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. సీఎంఆర్ సరఫరాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తామని.. ఎఫ్‌సీఐ మిల్లర్లతో సమన్వయం చేసుకుని అడ్డంకులను పరిష్కరించాలని అధికారులకు ఆయన సూచించారు. సమీక్షలో అదనపు కలెక్టర్ భుజంగరావు, డీసీవోలు, డీఎంలు హాజరయ్యారు.

ఇది కూడా చదవండి..: Prashanth Reddy | గృహనిర్భందం చేసి నా గొంతు నొక్కలేరు.. మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి