July 17 Market Analysis | నెగెటివ్​గా గ్లోబల్ మార్కెట్లు.. ఫ్లాట్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌నిఫ్టీ

గ్లోబల్ మార్కెట్లు ఎరుపెక్కాయి. గిఫ్ట్ నిఫ్టీ స్వల్ప నష్టాలతో ఉండడంతో మన మార్కెట్లు ఫ్లాట్ టు నెగెటివ్ గా ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: July 17 Market Analysis | అమెరికా, ఇరాన్‌ Iran పై దాడులు కొనసాగిస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున వంతెనలపై వైమానిక దాడులు చేసింది. మరోవైపు, ఇరాన్ మధ్యప్రాచ్యంలోని యూఎస్ మిత్రదేశాలపై కొత్త క్షిపణి దాడులను ప్రారంభించి, తమ దాడులు మరింత తీవ్రమవుతాయని హెచ్చరించింది.

దీంతో గ్లోబల్ మార్కెట్లు బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. సెమీకండక్టర్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి కారణంగా యూఎస్ స్టాక్ మార్కెట్ గత సెషన్‌లో నష్టాలతో ముగిసింది. శుక్రవారం ప్రధాన ఆసియా మార్కెట్లు సైతం నష్టాల బాటలో సాగుతున్నాయి.

July 17 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

గత సెషన్‌లో నాస్‌డాక్ 1.47 శాతం, ఎస్ అండ్ పీ 0.51 శాతం నష్టపోగా.. శుక్రవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.56 శాతం నష్టంతో ఉంది.

July 17 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

యూకేకు చెందిన ఎఫ్ టీఎస్ ఈ 0.53 శాతం పెరగ్గా.. జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.34 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.05 శాతం నష్టపోయాయి.

July 17 Horoscope | మహిళల ద్వారా కొత్త బిజినెస్, ఉద్యోగ అవకాశాలు.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు

July 17 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 8 గంటల ప్రాంతంలో తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 3.98 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 4.18 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 1.39 శాతం, చైనాకు చెందిన షాంఘై 1.21 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.45 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి.

దక్షిణ కొరియా మార్కెట్లు సెలవు కారణంగా మూసి ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ, నిఫ్టీ 0.03 శాతం నష్టంతో ఉండడంతో మన మార్కెట్లు ఫ్లాట్ టు గ్యాప్ డౌన్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

గమనించాల్సిన అంశాలు..

  • ఎఫ్ ఐఐలు గత సెషన్‌లో నికరంగా రూ. 4,205 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
  • డీఐఐలు గత సెషన్‌లో నికరంగా రూ. 2,986 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 0.95 నుంచి 0.97 కు పెరిగింది.
  • విక్స్ 2.92 శాతం తగ్గి 12.88 వద్ద ఉంది.
  • క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 84.98 డాలర్ల వద్ద ఉంది.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 8 పైసలు బలహీనపడి 96.35 వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 100.76 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.56 వద్ద ఉన్నాయి.
Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *