Tata AIA Fire Safety | దేశవ్యాప్తంగా అగ్నిమాపక అవగాహన సదస్సులు.. 40,000 మందికి పైగా చేరువైన ‘టాటా పీఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్’

టాటా గ్రూప్ 'ఫైర్ ప్రిపేర్డ్‌నెస్ అండ్ ప్రివెన్షన్ వీక్ 2026'లో భాగంగా 'టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్' (Tata AIA Life Insurance) దేశవ్యాప్తంగా భారీ అగ్నిమాపక భద్రతా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Tata AIA Fire Safety | టాటా గ్రూప్ ‘ఫైర్ ప్రిపేర్డ్‌నెస్ అండ్ ప్రివెన్షన్ వీక్ 2026’లో భాగంగా ‘టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్’ (Tata AIA Life Insurance) దేశవ్యాప్తంగా భారీ అగ్నిమాపక భద్రతా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. “నివారించండి.. సిద్ధంగా ఉండండి.. స్పందించండి” (Prevent. Prepare. Respond.) అనే ప్రధాన నినాదంతో నిర్వహించిన ఈ ప్రచారంలో ఏకంగా 40,210 మంది పాల్గొన్నారు.

Tata AIA Fire Safety | విస్తృత ప్రచారం..

ముంబై ( Mumbai ) , హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ-ఎన్‌సీఆర్, కోల్‌కతా, జైపూర్, లక్నో, అహ్మదాబాద్, పుణే వంటి ప్రధాన నగరాలతో పాటు దేశ వ్యాప్తంగా 466 ప్రాంతాల్లో ఈ అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదాలు జరిగితే ప్రాణ, ఆస్తి నష్టాలను ఎలా అరికట్టాలి, అత్యవసర సమయాల్లో ఎలా సురక్షితంగా బయటపడాలి అనే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

Tata AIA Fire Safety | అన్ని వర్గాల భాగస్వామ్యం..

ఈ ప్రచారంలో టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్‌కి చెందిన 13,862 మంది ఉద్యోగులతో పాటు పాఠశాలలు, కళాశాలలు, హౌసింగ్ సొసైటీలు, కార్యాలయాలు, కోచింగ్ సెంటర్లు , వ్యాపార సంస్థలకు చెందిన 26,348 మంది సాధారణ ప్రజలు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. అందరినీ భాగస్వాములను చేస్తూ ఫైర్ సేఫ్టీ డ్రిల్స్, అగ్నిమాపక పరికరాల వినియోగంపై ప్రత్యక్ష ప్రదర్శనలు, క్విజ్ పోటీలు , అత్యవసర స్పందన వర్క్‌షాప్‌లను నిర్వహించారు.

Tata AIA Fire Safety | సేఫ్టీ అనేది అందరి బాధ్యత..

ఈ సందర్భంగా టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ & సీఈఓ వెంకీ అయ్యర్ మాట్లాడుతూ.. “భద్రత అనేది మనందరి ఉమ్మడి బాధ్యత. ప్రమాదాలు జరిగినప్పుడు సమర్థవంతంగా స్పందించి ప్రాణాలను కాపాడుకోవడానికి సమాజంలో ముందస్తు అవగాహన, సద్ధత ఎంతో అవసరం. కేవలం మా ఉద్యోగులకే కాకుండా పాఠశాలలు, నివాస ప్రాంతాల ప్రజలకు ఈ అంశాలపై శిక్షణ ఇవ్వడం ద్వారా సురక్షిత సమాజ నిర్మాణానికి పునాది వేస్తున్నాం” అని తెలిపారు.

కార్పొరేట్ ఆఫీసులకే పరిమితం కాకుండా నివాస ప్రాంతాలు, విద్యాసంస్థల్లో సైతం అగ్నిమాపక భద్రతపై అవగాహన పెంచుతూ టాటా ఏఐఏ చేపట్టిన ఈ సామాజిక కార్యక్రమానికి పలువురి నుంచి విశేష స్పందన లభించింది.

ఇది కూడా చదవండి: Nizamabad Couple Assault Arrest | దంపతులపై దాడిచేసిన ఇద్దరు నిందితుల అరెస్ట్​

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *