అక్షరటుడే వెబ్‌డెస్క్: Seagrams Xclamation | ప్రముఖ ఆల్కహాల్ బేవరేజెస్ సంస్థ పెర్నోడ్ రికార్డ్ ఇండియా ( India )ఆంధ్రప్రదేశ్ మార్కెట్లో సరికొత్త సంచలనానికి తెరతీసింది. గత 30 ఏళ్లలో కంపెనీ చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మక ఆవిష్కరణగా ‘సీగ్రామ్స్ ఎక్స్‌క్లామేట్!ఆన్’ (Seagram’s Xclamat!on) బ్రాండ్‌ను విడుదల చేసినట్లు ప్రకటించింది. భారతదేశంలోనే అత్యంత ప్రత్యేకమైన పోర్ట్‌ఫోలియోగా వస్తున్న ఈ బ్రాండ్.. విస్కీ, వోడ్కా, జిన్, రమ్ , బ్రాందీ అనే ఐదు విభిన్న స్పిరిట్ కేటగిరీలను ఒకే ప్రీమియం బ్లెండెడ్ శ్రేణిలో, ఒకే ధరకే అందిస్తుండటం విశేషం.
Seagrams Xclamation | యువతను ఆకట్టుకునేలా ..
దేశంలో వేగంగా పెరుగుతున్న 26-30 సంవత్సరాల వయస్సు గల యువ వినియోగదారుల అభిరుచులకు తగినట్లుగా ఈ బ్రాండ్‌ను తీర్చిదిద్దారు. స్నేహితులు, మహిళలు , పురుషులు కలిసి పాల్గొనే సామాజిక సమావేశాల్లో ఒక్కొక్కరికి ఒక్కో డ్రింక్ పట్ల ఆసక్తి ఉంటుంది. ఈ వైవిధ్యాన్నే దృష్టిలో ఉంచుకుని విస్కీతో పాటు జిన్, వోడ్కా, రమ్, బ్రాందీలను ఒకే వేదికపైకి తీసుకువచ్చారు. ప్రతిఏటా చట్టబద్ధమైన వయస్సులోకి ప్రవేశించే కోట్లాది మంది యువతకు అందుబాటు ధరల్లో నాణ్యమైన అనుభూతిని అందించడమే ఈ బ్రాండ్ ప్రధాన ఉద్దేశం.
Seagrams Xclamation | ఐదు విభిన్న శ్రేణులు..
ఈ ఏకీకృత బ్రాండ్‌లోని ప్రతీ కేటగిరీ ప్రత్యేకమైన సాంకేతికతతో తయారవుతుంది. విస్కీని డ్యూయల్ కాస్క్‌లలో పరిణితి చెందిన స్పీసైడ్ స్కాచ్ మాల్ట్స్‌తో తయారు చేయగా.. బ్రాందీని ఫ్రెంచ్ లిమోసిన్ కాస్క్‌లలో పరిపక్వం చేశారు. రమ్‌ను జమైకా స్పిరిట్స్ మిశ్రమంతో రాగి, స్టీల్ కుండల్లో తయారు చేయగా, వోడ్కాను రష్యాకు చెందిన ‘మూన్ స్టోన్ టెక్నాలజీ’తో ఫిల్టర్ చేశారు. ఇక జిన్‌ను జర్మనీకి చెందిన జునిపర్ బెర్రీస్, భారతీయ మూలికల కలయికతో 7 విభిన్న రుచులలో అభివృద్ధి చేశారు.
Seagrams Xclamation | ఆధునిక తరానికి అనుగుణంగా ..
పెర్నాడ్ రికార్డ్ ఇండియా సీఈఓ జీన్ టోబౌల్ మాట్లాడుతూ.. మూడు దశాబ్దాలుగా ప్రీమియం స్పిరిట్స్ పరిశ్రమను తీర్చిదిద్దుతున్న తమ సంస్థ నుంచి వస్తున్న ఈ బ్రాండ్, ఆధునిక వినియోగదారుల ఆలోచనల నుంచి పుట్టిందని తెలిపారు. ఇది కేవలం బ్రాండ్ మాత్రమే కాదని, అంతర్జాతీయ విజ్ఞానంతో రూపొందించబడిన భారతీయ స్పిరిట్స్ మిశ్రమమని పేర్కొన్నారు. ఈ బ్రాండ్‌కు సంబంధించిన ప్రత్యేకమైన (ఎక్స్‌క్లామేషన్) లోగో రద్దీగా ఉండే రిటైల్ మార్కెట్లలో వినియోగదారులను ఇట్టే ఆకట్టుకునేలా రూపొందించారు.
ఇది కూడా చదవండి: Eagle Force | ఒడిశా నుంచి గంజాయి.. 400 కిలోలు అమ్మిన ముఠా