Polymer Currency Notes | త్వరలో పాలిమర్ నోట్లు.. మార్పు నకు ఆర్‌బీఐ సన్నాహాలు

భారత కరెన్సీ చరిత్రలో మరో కీలక అడుగు పడనుంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Polymer Currency Notes | భారత కరెన్సీ చరిత్రలో మరో కీలక అడుగు పడనుంది. సాధారణ కాగితపు నోట్లకు భిన్నంగా, అత్యంత మన్నికైన ‘పాలిమర్’ (ప్లాస్టిక్) నోట్లను ప్రవేశపెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కసరత్తు చేస్తోంది. 2027 నాటికి వీటిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలన్నది ఆర్‌బీఐ లక్ష్యం.

Polymer Currency Notes | ఎందుకు ఈ పాలిమర్ నోట్లు?

సాధారణ కరెన్సీ నోట్లు త్వరగా చిరిగిపోవడం, తడిస్తే పాడైపోవడం లేదా మురికి పట్టడం వంటి సమస్యలు ఉంటాయి. కానీ పాలిమర్ నోట్లు నీటిని తట్టుకోగలవు, మన్నిక ఎక్కువగా ఉంటుంది , త్వరగా పాడవవు. అంతేకాకుండా, వీటిలో అధునాతన భద్రతా ఫీచర్లు పొందుపరచడం వల్ల నకిలీ నోట్ల తయారీని చాలా వరకు అరికట్టవచ్చు.

rbi.1

Polymer Currency Notes | ప్రయోగాత్మకంగా ప్రారంభం..

ఈ కొత్త తరహా కరెన్సీని నేరుగా అందరికీ అందుబాటులోకి తీసుకురాకుండా, ముందుగా పైలట్ ప్రాజెక్ట్ కింద రూ.10 , రూ.20 నోట్లను ముద్రించనున్నారు. వీటి వినియోగంపై ప్రజల నుంచి వచ్చే అభిప్రాయాలను, సాంకేతిక పనితీరును గమనించిన తర్వాతే దశలవారీగా ఇతర విలువైన నోట్లను తీసుకురావాలని ఆర్‌బీఐ భావిస్తోంది. ఈ నోట్ల ముద్రణకు అవసరమైన ప్రత్యేక ‘పాలిమర్ సబ్‌స్ట్రేట్ షీట్ల’ సరఫరా కోసం ఆర్‌బీఐ నోట్ల ముద్రణ విభాగం ఇప్పటికే గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కూడా ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ధృవీకరించడంతో, భారత్ కూడా త్వరలోనే ఆస్ట్రేలియా, కెనడా, యూకే వంటి దేశాల సరసన నిలవనుంది.

Polymer Currency Notes | పాత నోట్ల పరిస్థితి ఏంటి?

పాలిమర్ నోట్లు వస్తున్నాయంటే పేపర్ కరెన్సీని పూర్తిగా రద్దు చేస్తున్నారని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ ప్రక్రియ దశలవారీగా జరుగుతుంది. కొత్త నోట్లు చలామణిలోకి వచ్చిన తర్వాత కూడా పాత నోట్లు యథావిధిగా కొనసాగుతాయి. కరెన్సీ నిర్వహణను మరింత ఆధునీకరించడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం.

ఇది కూడా చదవండి:  Kedarnath Landslide | కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *