అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bullet Train Project | భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై భారత్, జపాన్ మధ్య సాంకేతిక అంశాలపై విభేదాలు కొనసాగుతున్నాయి. ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించిన జపాన్ మాజీ మంత్రి హిదేకి మాకిహారా, ప్రాజెక్టు ఆలస్యంపై భారత ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
Bullet Train Project | యూరోపియన్ సాంకేతికతపై ఆసక్తి!
ముంబయి-అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు కారిడార్‌లో సిగ్నలింగ్ వ్యవస్థ ఎంపిక అంశమే ప్రధాన వివాదంగా మారినట్లు తెలుస్తోంది. జపాన్ తన అభివృద్ధి చేసిన D-ATC సిగ్నలింగ్ టెక్నాలజీని వినియోగించాలని సూచిస్తుండగా.. భారత్ మాత్రం అంతర్జాతీయంగా వినియోగంలో ఉన్న యూరోపియన్ ETCS సాంకేతికతపై ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.
సిగ్నలింగ్ వ్యవస్థపై ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న చర్చల కారణంగా ప్రాజెక్టు పురోగతిపై ప్రభావం పడుతోందని జపాన్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ సాంకేతిక నిర్ణయం త్వరగా ఖరారు కావాలని వారు కోరుతున్నారు.
Middle East Crisis | మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రం.. లెబనాన్ నుంచి గల్ఫ్ వరకు సంక్షోభం!
Bullet Train Project | 2029 నాటికి పూర్తిగా అందుబాటులోకి..
ఇదిలా ఉండగా.. ప్రాజెక్టు నిర్మాణ పనులను భారత్ వేగవంతం చేస్తోంది. సాంకేతిక చర్చలతో పాటు భూసేకరణ, వంతెనలు, స్టేషన్ల నిర్మాణం వంటి సివిల్ పనులు కొనసాగుతున్నాయి.
ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో తొలి దశను 2027 నాటికి, పూర్తి కారిడార్‌ను 2029 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.
భారత్-జపాన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంలో కీలకమైన ఈ ప్రాజెక్టు భవిష్యత్‌లో ఇరు దేశాల సాంకేతిక సహకారానికి ఒక ముఖ్యమైన పరీక్షగా మారనుంది.