Fast Food Center Raids | ఫాస్ట్​ఫుడ్​ సెంటర్లపై దాడులు.. ముగ్గురి అరెస్ట్​

చంద్రాయణగుట్టలో గల పలు ఫాస్ట్​ ఫుడ్​ సెంటర్లపై అధికారులు దాడులు చేశారు. రెండు కేసులు నమోదు చేసి, ముగ్గురిని అరెస్ట్ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Fast Food Center Raids | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో కల్తీ ఆహార పదార్థాలను అరికట్టడానికి హెచ్​ –ఫాస్ట్ బృందం అధికారులు నిత్యం తనిఖీలు చేస్తున్నారు. హోటళ్లు, ఆహార పదార్థాల తయారీ యూనిట్లపై దాడులు చేస్తూ చర్యలు తీసుకుంటున్నారు.

నగరంలోని చంద్రాయణగుట్టలో గల పలు ఫాస్ట్​ ఫుడ్​ సెంటర్లపై తాజాగా అధికారులు దాడులు చేశారు. అల్మదీనా, ఒమర్ చైనీస్ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లపై దాడులు చేసి, 80 కిలోల చికెన్​ స్వాధీనం చేసుకుకున్నారు. అత్యంత అపరిశుభ్రమైన పరిస్థితులలో ఆహారాన్ని తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. రెండు కేసులు నమోదు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సెంటర్లలో పునర్వినియోగించిన వంటనూనెను, కృత్రిమ ఆహార రంగులను ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

Fast Food Center Raids | అపరిశుభ్ర వాతావరణంలో..

ఆహార కల్తీని అరికట్టడానికి, ఆహార భద్రతా నిబంధనలను అమలు చేయడానికి జీహెచ్‌ఎంసీ, ఆహార భద్రతా అధికారులతో కలిసి హెచ్​ ఫాస్ట్​ అధికారులు తనిఖీలు చేశారు. కీటక నియంత్రణ రికార్డులు, నీటి విశ్లేషణ ధృవపత్రాలు లేకపోవడం, ఇతర అసురక్షిత ఆహార నిర్వహణ పద్ధతులను కూడా అధికారులు గమనించారు. 20 లీటర్ల పునర్వినియోగ వంట నూనె, 10 లీటర్ల తాజా వంట నూనె, సుమారు 40 కిలోల వేయించిన చికెన్, 40 కిలోల రంగు వేసిన పచ్చి చికెన్, 6 ప్యాకెట్ల సింథటిక్ ఫుడ్ కలర్స్‌ను అధికారులు సీజ్​ చేశారు.

ఇది కూడా చదవండి..: Vikram 1 Launch | నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్–1 రాకెట్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *