England vs India ODI | ఇంగ్లాండ్​ భారీ స్కోర్​.. భారత్​ లక్ష్యం 388 పరుగులు

లార్డ్స్​ వేదికగా జరుగుతున్న ఆఖరు మ్యాచ్​లో ఇంగ్లాండ్​ భారీ స్కోర్​ చేసింది. భారత్​ ముందు 388 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : England vs India ODI | లార్డ్స్​ వేదికగా జరుగుతున్న ఆఖరు మ్యాచ్​లో ఇంగ్లాండ్​ బ్యాటర్లు రెచ్చిపోయారు. భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీంతో ఇంగ్లిష్​ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 387 పరుగులు చేసింది.

ఇంగ్లాండ్​ పర్యటనలో భాగంగా భారత్ టీ 20 సిరీస్​ను కోల్పోయింది. అనంతరం తొలి వన్డేలో ఘన విజయం సాధించిన భారత జట్టు, రెండో వన్డేలో ఓడిపోయింది. దీంతో సీరిస్​లో రెండు జట్లు 1–1తో సమంగా ఉన్నాయి. సిరీస్​ గెలవాలంటే కీలకమైన మూడో మ్యాచ్​లో ఇంగ్లిష్​ బ్యాటర్లు రెచ్చిపోయారు. ఓపెనర్​ బెన్ డకెట్ (Ben Ducket) సెంచరీతో చెలరేగాడు. 135 బంతుల్లో 141 పరుగులు చేశాడు. జాకోబ్​ బెతెల్​ (91) తృటిలో సెంచరి కోల్పోయాడు.

England vs India ODI | మెరుపు ఇన్నింగ్స్​

ఓపెనర్లు ఔట్​ అయిన తర్వాత జో రూట్​ (Joe Root), బట్లర్ మెరుపు ఇన్నింగ్స్​ ఆడారు. టీ 20 తరహా బ్యాటింగ్​తో స్కోర్​ బోర్డును పరుగులు పెట్టించారు. హ్యారీ బ్రూక్  14 పరుగులకే అవుట్​ అయినా.. రూట్​ 48 బంతుల్లో 74 పరుగులు చేశాడు. బట్లర్ 13 బంతుల్లో 41 పరుగులతో రాణించాడు. ఇందులో 4 ఫోర్లు, 3 సిక్స్​లు ఉన్నాయి. బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో లార్డ్స్​లో ఇంగ్లాండ్​ మూడు వికెట్లు కోల్పోయి 387 పరుగులు చేసింది. వన్డే చరిత్రలో లార్డ్స్​ స్టేడియంలో ఇదే అత్యధిక స్కోర్​ కావడం గమనార్హం. భారత బౌలర్లలో ప్రసిద్​ కృష్ణ రెండు వికెట్లు తీయగా.. గుర్నూర్​ బ్రార్​ పది ఓవర్లో 97 పరుగులు ఇచ్చాడు.

 

దీనిని కూడా చదవండి : Harish Rao | రైతుల పట్ల రేవంత్ సర్కారు రాక్షస పాలన: హరీశ్ రావు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *