Abhijeet Deepke | దీక్ష విరమించిన అభిజీత్​ దీప్కే

కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దీప్కే జంతర్ మంతర్ వద్ద తన నిరాహార దీక్షను విరమించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Abhijeet Deepke | కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దీప్కే జంతర్ మంతర్ వద్ద తన నిరాహార దీక్షను విరమించారు. ఆసుపత్రిలో ఉన్న కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) అభ్యర్థన మేరకు సోమవారం ఉదయం దీక్షను విరమించారు.

నిరసనను కొనసాగించడానికి శక్తి అవసరమని భావించి, తన దీక్షను విరమించాలని వాంగ్‌చుక్ కోరారని ఆయన భార్య గీతాంజలి అంగ్మో జంతర్ మంతర్ నిరసన వేదికపై ప్రకటించిన తర్వాత దీప్కే జ్యూస్ తాగారు. ఆ వెంటనే దిప్కే, అంగ్మో పార్లమెంట్ వైపు సాగుతున్న నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. వీరితో పాటు, ఆత్మహత్య చేసుకున్న నీట్ (NEET) అభ్యర్థిని రియా కుమారి తండ్రి కూడా ఉన్నారు. వేలాది మంది సీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు పార్లమెంట్ వైపు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.

Abhijeet Deepke | ఖండించిన నడ్డా

చర్చల కోసం ప్రభుత్వం తమను సంప్రదించిందని CJP కీలక నాయకులలో ఒకరైన సౌరవ్ దాస్ ప్రకటించారు. జేపీ నడ్డాతో తాము చర్చిస్తామని ఆయన తెలిపారు. అయితే ఈ వార్తలను జేపీ నడ్డా ఖండించారు. తాము సీజేపీతో చర్చలు జరపడం లేదని స్పష్టం చేశారు. కాగా సీజేపీ నాయకులు తమ ర్యాలీని నిలిపివేశారు. ఇప్పటికే పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ప్రతిపక్షాలు సైతం సీజేపీ ర్యాలీకి మద్దతు తెలిపాయి. దీంతో ఢిల్లీలో హైటెన్షన్​ నెలకొంది.

నీట్​ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ, జంతర్ మంతర్ వద్ద వాంగ్‌చుక్ 21 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. అయితే పోలీసులు వాంగ్‌చుక్‌ను జంతర్ మంతర్ నిరసన స్థలం నుండి ఆసుపత్రికి తరలించడంతో దీప్కే శనివారం దీక్ష ప్రారంభించారు. సోమవారం ఉదయం ఆయన దీక్షను విరమించారు.

ఇది కూడా చదవండి..: Sonam Wangchuk | ఈ మూడు షరతులు ఒప్పుకుంటే దీక్షా విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్ 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *