Karate Guinness Record | గిన్నిస్​ రికార్డు సాధించిన కరాటే క్రీడాకారులను అభినందించిన పీసీసీ చీఫ్​..

గిన్నిస్​ రికార్డు సాధించిన కరాటే క్రీడాకారులను పీసీసీ చీఫ్​ బొమ్మ మహేష్​కుమార్​ గౌడ్​ ప్రత్యేకంగా అభినందించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Karate Guinness Record | గిన్నిస్​ రికార్డు సాధించిన కరాటే క్రీడాకారులను పీసీసీ చీఫ్​ బొమ్మ మహేష్​కుమార్​ గౌడ్​ ప్రత్యేకంగా అభినందించారు. ఈ మేరకు కరాటే క్రీడాకారులు మంగళవారం జిల్లాకు వచ్చేసిన పీసీసీ చీఫ్​ (PCC Chief)ను కలువగా ఆయన వారిని అభినందించి సన్మానించారు.

Karate Guinness Record | అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్​ మెడల్​ సాధించాలి

బొమ్మ మహేష్​కుమార్​ గౌడ్​ మాట్లాడుతూ.. జిల్లా క్రీడాకారులు కరాటేలో గిన్నిస్​ రికార్డ్​ సాధించడం గొప్ప విషయమన్నారు. కరాటే మాస్టర్, తెలంగాణ లీ మార్షల్ ఆర్ట్స్ కరాటే అకాడమీ ఫౌండర్ ప్రెసిడెంట్, ఇంటర్నేషనల్ బృస్​లీ అవార్డ్ గ్రహీత ఎడ్ల వెంకటేష్ ఆధ్వర్యంలో క్రీడాకారులు ఈ ఘనత సాధించడం భేష్​ అన్నారు. మహేష్ కుమార్ గౌడ్ తన కరాటే గ్రాండ్ మాస్టర్ శ్రీనివాసన్​ను గుర్తు చేసుకున్నారు. కరాటేలో గిన్నిస్ రికార్డ్​లో భాగంగా గోల్డ్ మెడల్స్, సర్టిఫికెట్స్ సాధించిన కరాటే మాస్టర్ ఎడ్ల వెంకటేష్, ఎడ్ల రిత్విక్, వైభవ్ తేజ్, సాయి నిహాల్, స్టేట్ లెవల్ కరాటే సిల్వర్ మెడలిస్ట్ నచికేతన్​ను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఎడ్ల వెంకటేష్​ మాట్లాడుతూ.. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన కరాటేలో తైకీకి షోదన్ కటాను 800 మూవ్​మెంట్స్​ను ఏకదాటిగా 20 నిమిషాల పాటు చేయడం ద్వారా గిన్నిస్​ రికార్డు సాధించామని వివరించారు.

ఇది కూడా చదవండి..: Telangana Reservoirs | అడుగంటిన ప్రాజెక్ట్​లు.. ఆందోళనలో రైతన్నలు..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *