Kamareddy Fire Victims | బాధితులను ఆదుకుంటాం: టీపీసీసీ జనరల్ సెక్రెటరీ చంద్రశేఖర్ రెడ్డి

Shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Fire Victims | పట్టణంలోని ఇందిరాచౌక్ వద్ద అగ్నిప్రమాదంలో (Fire Accident) కాలిపోయిన దుకాణాలను టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించారు. బాధితులతో మాట్లాడి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.

Kamareddy Fire Victims | బాధితులకు ఆర్థికసాయం అందజేత

అగ్ని ప్రమాద బాధితులకు గడ్డం చంద్రశేఖర్​ రెడ్డి ఆర్థికసాయం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జరిగిన ఘటన చాలా బాధాకరమని, ప్రమాదంలో దాదాపు రూ.కోటి నష్టం జరిగిందన్నారు. వెంటనే జిల్లా ఎస్పీ, పోలీస్ యంత్రాంగం, ఆర్డీవో, రెవెన్యూ అధికారులు జరిగిన ప్రమాదంపై ఆరా తీయాలని కోరారు. అలాగే కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి (MLA Katipally Venkata Ramana Reddy) సైతం బాధితులను పరామర్శించిన విషయం తెలిసిందే. వీలైనంత త్వరగా బాధితులను ఆదుకోవాలని అధికారులకు సూచించారు. ఘటన జరగడానికి షార్ట్ సర్క్యూటే కారణమా.. ఇంకా ఏవైనా కారణాలున్నాయా అనే కోణంలో విచారణ చేపట్టాలన్నారు. ఆయన వెంట మున్సిపల్ కౌన్సిలర్ గడ్డమీది మహేష్, డీసీసీ ప్రధాన కార్యదర్శి జూలూరి సుధాకర్, మాజీ కౌన్సిలర్లు చాట్ల వంశీ, సలీం, జమీల్, రంగ రమేష్, గంగుల్ రెడ్డి, రాజశేఖర్, నిరంజన్, కోటి, శశి, రాహుల్ ఉన్నారు.

ఇది కూడా చదవండి..: BJP victory rally | నగరంలో బీజేపీ విజయోత్సవ ర్యాలీ.. సంబరాలు

 

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *