అక్షరటుడే, కామారెడ్డి: Excise Vanamahotsavam | భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుంద రెడ్డి (Excise Department,) అన్నారు. వనమహోత్సవంలో (Vanamahotsavam) భాగంగా మంగళవారం కామారెడ్డి (kamareddy) మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ఈత మొక్కలు నాటారు.
Excise Vanamahotsavam | పర్యాపరణ పరిరక్షణ కోసం..
ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం కోసం ప్రభుత్వం చేపడుతున్న వనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రజలంతా విజయవంతం చేయాలని కోరారు. నాటిన ప్రతిమొక్కను సంరక్షించడం ద్వారానే పర్యావరణానికి మేలు జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఈత చెట్ల పెంపకం గౌడ కుల వృత్తిదారుల జీవనోపాధికి ఎంతో ఉపయోగకరమని, ఈతమొక్కల పెంపకాన్ని ప్రోత్సహించడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామీణ ఆర్థికాభివృద్ధికి కూడా తోడ్పాటు అందుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భీమయ్యల లక్ష్మీరాజు, ఉప సర్పంచ్ లక్ష్మీ నారాయణ, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అరుణ్ చంద్ర, సీఐ సంపత్ కృష్ణ, ఎస్సైలు విక్రమ్ కుమార్, శ్రీనివాసరావు, ఏపీవో అన్నపూర్ణ, హెడ్ కానిస్టేబుళ్లు జాన్, ఫరీద్, కానిస్టేబుళ్లు ఘోరీ, రాజు, దినేష్, శరత్, పవన్, బాబు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలుపుతున్న ASP MP చంద్రశేఖర్ ఆజాద్‌ను కలిసిన MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ