అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Extranet Technologies IPO | ఎక్స్‌ట్రానెట్ టెక్నాలజీస్ కంపెనీని 2002లో స్థాపించారు. ఇది దేశంలోని వివిధ రకాల ఇండస్ట్రీస్ కోసం ఎంటర్ ప్రైజ్ అప్లికేషన్స్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, మ్యానేజ్డ్ సర్వీసెస్, ప్రొప్రైటరీ ప్లాట్ ఫారమ్స్, స్ట్రాటజిక్ టెక్నాలజీ పార్టనర్ షిప్స్ వంటి విస్తృత శ్రేణి ఐటీ సొల్యూషన్స్ అందించే కంపెనీలలో ఒకటి. ఇది తన అనుబంధ సంస్థలు, జాయింట్ వెంచర్లు, సొంత టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్‌ల మద్దతుతో ఆన్‌సైట్, ఆఫ్‌షోర్ డెలివరీ మోడల్స్ రెండింటినీ ఉపయోగించి తన సేవలను అందిస్తుంది.
Extranet Technologies IPO | రూ. 166.80 కోట్లు సమీకరించడం కోసం..
ఐపీఓ (IPO) ద్వారా కంపెనీ మొత్తం రూ. 166.80 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఫ్రెష్ ఇష్యూ కింద రూ. 10 ఫేస్ వ్యాల్యూ కలిగిన 1,31,34,000 షేర్లను జారీ చేయనుంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా వచ్చిన ఆదాయాన్ని కంపెనీ తీసుకున్న రుణాలను పూర్తిగా లేదా పాక్షికంగా చెల్లించడం కోసం, సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవసరాల కోసం, వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది.
Extranet Technologies IPO | ప్రైస్ బ్యాండ్ ..
కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరు ధరను రూ. 120 నుంచి రూ. 127 లుగా నిర్ణయించింది. ఒక లాట్‌లో 110 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్ కోసం గరిష్ట ప్రైస్ బ్యాండ్ వద్ద రూ. 13,970 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. రిటైల్ కేటగిరిలో గరిష్టంగా 14 లాట్ల కోసం బిడ్లు వేయవచ్చు.
Extranet Technologies IPO | కోటా, జీఎంపీ..
క్యూఐబీలకు 50 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం, ఎనఐఐలకు 15 శాతం వాటాను కేటాయించారు. ఈ కంపెనీ షేర్లకు గ్రే మార్కెట్ ప్రీమియం రూ. 13 లుగా ఉంది. ఐపీవో అలాట్ అయితే లిస్టింగ్ సమయంలో సుమారు 10 శాతం లాభాలు వచ్చే అవకాశాలున్నాయి.
ఐపీవో తేదీలు : ఐపీవో జూలై 23 న ప్రారంభమై 27 వరకు అందుబాటులో ఉంటుంది. 28న అర్ధరాత్రి షేర్ల అలాట్‌మెంట్ వివరాలు తెలిసే అవకాశాలున్నాయి. కంపెనీ షేర్లు 30న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్ అవుతాయి.
ఇది కూడా చదవండి..: July 23 Gold Prices | అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావం..మళ్లీ పరుగులు తీస్తున్న బంగారం, వెండి ధరలు!