అక్షరటుడే, వెబ్డెస్క్: Kumki Elephants | ఏపీ డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ కుంకీ ఏనుగులకు అమరావతిలో ఘన స్వాగతం పలికారు. పార్వతీపురానికి తరలిస్తున్న ఏనుగులకు క్యాంప్ కార్యాలయం వద్ద ఆయన స్వాగతం పలికారు.
పార్వతిపుంర మన్యం జిల్లాలో అడవి ఏనుగులు ఇటీవల బీభత్సం సృష్టిస్తున్నాయి. ఏనుగుల గుంపు అడవిలో నుంచి వచ్చి పంటలను ధ్వంసం చేస్తోంది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ (Deputy CM Pawan) అడవి ఏనుగులను అదుపు చేసేందుకు కుంకీ ఏనుగులను మన్యం జిల్లాకు పంపాలని ఆదేశించారు. పలమనేరు ముసలిమడుగు క్యాంపు నుంచి బయలుదేరిన ‘అభిమన్యు’, ‘జయంత్’ అనే రెండు కుంకీ ఏనుగులకు మంగళగిరిలోని తన కార్యాలయం వద్ద శుక్రవారం పవన్ కల్యాణ్ ఘన స్వాగతం పలికారు.
Kumki Elephants | గుచ్చమి క్యాంపునకు..
విజయనగరం, మన్యం జిల్లాల్లో పంటపొలాల్ని నాశనం చేస్తున్న అడవి ఏనుగులను కట్టడి చేయడానికి వీటిని పంపిస్తున్నట్లు పవన్ తెలిపారు. ఏనుగులపై ఆయన పూలు చల్లారు. అనంతరం చెరుకు గెడల్ని ఆహారంగా అందించారు. ఈ కుంకీ ఏనుగులను మన్యం జిల్లాలోని గుచ్చిమి క్యాంపునకు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. అక్కడి నుంచి అడవి ఏనుగులు సంచరించే ప్రాంతాలకు తీసుకు వెళ్లారు. కాగా పవన్ కల్యాణ్ భుజానికి ఇటీవల ఆపరేషన్ జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నాయి. అయినా కూడా చేతికి కట్టుతో ఏనుగులకు స్వాగతం పలకాడినికి వచ్చారు.
అమరావతికి కుంకీ ఏనుగుల రాక.. స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ pic.twitter.com/tqbdf7so0e
— greatandhra (@greatandhranews) July 24, 2026
ఇది కూడా చదవండి..: Omicron RF 5 AP | ఏపీలో ఒమిక్రాన్ RF.5 వికృత రూపం..16కి చేరిన కేసుల సంఖ్య!