అక్షరటుడే వెబ్‌డెస్క్: Adani Airline Business | కొత్త విమానయాన సంస్థను (Airline Business) ప్రారంభించనున్నట్లు వస్తున్న వార్తలను అదానీ ఎంటర్‌ప్రైజెస్ (Adani Enterprises) అధికారికంగా ఖండించింది. ఈ మేరకు స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు ఇచ్చిన ఫైలింగ్‌లో స్పష్టతనిచ్చింది. తాము ఎయిర్‌లైన్ వ్యాపారంలోకి ప్రవేశించేందుకు ఎలాంటి ప్రతిపాదనను పరిశీలించడం లేదని, మీడియాలో వస్తున్న కథనాలు పూర్తిగా నిరాధారమైనవి , వాస్తవానికి దూరంగా ఉన్నాయని కంపెనీ పేర్కొంది. గౌతమ్ అదానీ నేతృత్వంలోని ఈ సంస్థ కొత్త విమానయాన సేవలను ప్రారంభించే అవకాశాలను అన్వేషిస్తోందంటూ కొద్ది రోజులుగా జాతీయ మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో అదానీ గ్రూప్ ఈ క్లారిటీ ఇచ్చింది.
Adani Airline Business | స్పష్టం చేసిన అదానీ గ్రూప్..
విమానయాన సంస్థను నడపడంలో లాభాల మార్జిన్లు చాలా తక్కువగా ఉంటాయని, దానికి భిన్నమైన కార్యాచరణ విధానం అవసరమని డిసెంబర్ 2025లో అదానీ ఎయిర్‌పోర్ట్స్ డైరెక్టర్ జీత్ అదానీ రాయిటర్స్‌తో మాట్లాడుతూ తెలిపారు. దీర్ఘకాలిక పెట్టుబడి దృక్పథంతో భారీ స్థాయి భౌతిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను అభివృద్ధి చేయడం, నిర్వహించడంలోనే తమ గ్రూపు బలం ఉందని ఆయన అప్పట్లో నొక్కి చెప్పారు.
Adani Airline Business | నిర్వహణపైనే ప్రధాన దృష్టి..
ప్రయాణీకుల విమానాలను నడపడంపై ఆసక్తి లేకపోయినా, అదానీ గ్రూప్ భారతదేశ విమానయాన మౌలిక సదుపాయాల రంగంలో బలమైన స్థానంలో ఉంది. ‘అదానీ ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్’ ద్వారా ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు దేశవ్యాప్తంగా మొత్తం ఎనిమిది విమానాశ్రయాలను ఈ గ్రూప్ నిర్వహిస్తోంది. ప్రయాణీకుల విమానయాన సంస్థలను నేరుగా నడపడం కంటే, విమానాశ్రయాల మౌలిక సదుపాయాలు , సంబంధిత సేవలను విస్తరించడంపైనే తమ పూర్తి దృష్టి కేంద్రీకృతమై ఉందని సంస్థ మరోసారి స్పష్టం చేసింది. ప్రస్తుతం భారతీయ విమానయాన మార్కెట్‌లో ఇండిగో, ఎయిర్ ఇండియా సంస్థల ఆధిపత్యం కొనసాగుతుండగా.. గతంలో జెట్ ఎయిర్‌వేస్, గో ఫస్ట్ వంటి పలు సంస్థలు మూతపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్ ఎంట్రీపై వస్తున్న ఊహాగానాలకు ఈ ప్రకటనతో తెరపడింది.
Media Statement
24 July 2026, Ahmedabad
We would like to categorically deny the recent media reports and market speculation suggesting that Adani Enterprises is planning to launch an airline. These reports are entirely baseless and factually incorrect.
Adani Enterprises is not…
— Adani Group (@AdaniOnline) July 24, 2026
ఇది కూడా చదవండి: Kumki Elephants | కుంకీ ఏనుగులకు స్వాగతం పలికిన పవన్