అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Modi Instagram Record | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎక్స్, ఇన్స్టాగ్రామ్.. ఇలా ప్రజాదరణ పొందిన ఏ సామాజిక మాధ్యమాన్ని తీసుకున్నా భారీ సంఖ్యలో ఫాలోవర్లతో ఆయనదే అగ్రస్థానం. ఆయన చేసే పోస్టులకు సైతం భారీగా వ్యూస్ వస్తుంటాయి. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన రీల్ వైరల్‌గా మారి 24 గంటల్లోనే ఏకంగా 303 మిలియన్లకుపైగా వ్యూస్ సాధించడం గమనార్హం.
Modi Instagram Record | వైరల్ అయిన జెన్-జీ స్టైల్ సెల్ఫీ వీడియో..
నీట్ 2026 పరీక్షా పత్రాల లీకేజీ అంశంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) గురువారం అర్ధరాత్రి ఒక రీల్ పోస్ట్ చేశారు. ‘ఫ్రెండ్స్ ’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ.. జెన్ జీ పరిభాషలో విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. ఆయన జెన్-జీ తరహాలో పెట్టిన సెల్ఫీ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఒక్క వీడియోతోనే ప్రధాని ఇన్స్టాగ్రామ్ కొత్త ఫాలోవర్ల సంఖ్య పది లక్షలు పెరిగింది. అదీ 24 గంటల వ్యవధిలోనే… అంతేకాకుండా ఇదే సమయంలో 303 మిలియన్ల మంది దానిని వీక్షించారు. ఇది 2026 ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ కోసం ‘ఐషో స్పీడ్ ’ పేరిట చేసిన వీడియో కన్నా ఎక్కువ జనాదరణ పొందింది. ఆ వీడియో 300 మిలియన్ల వ్యూస్‌తో రికార్డ్ సృష్టించగా.. తాజాగా మోదీ చేసిన వీడియో 303 మిలియన్న వ్యూస్‌తో దానిని బ్రేక్ చేసింది.
Modi Instagram Record | 10.2 కోట్ల ఫాలోవర్లతో అగ్రస్థానం..
ఇన్స్టాగ్రామ్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రస్తుతం 102 మిలియన్ (10.2 కోట్ల) ఫాలోవర్లున్నారు. ఇందులోనూ మోదీనే నంబర్ వన్.
ఇది కూడా చదవండి..: ITR Filing Benefits | ఆదాయం లేకున్నా ఐటీఆర్ ఫైల్ చేయొచ్చు.. ఇలా చేస్తే ప్రయోజనాలెన్నో..