అక్షరటుడే, వెబ్డెస్క్: H-1B Visa Fee | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు ఆ దేశ కోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. హెచ్–1బీ వీసాలకు లక్ష డాలర్ల ఫీజు విధింపు విషయంలో దిగువ న్యాయస్థానం తీర్పుపై స్టే ఇచ్చేందుకు అప్పీల్స్ కోర్టు నిరాకరించింది.
నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికులకు జారీ చేసే కొత్త H-1B వీసాలపై లక్ష డాలర్ల రుసుమును విధించడాన్ని నిలిపివేస్తూ గతంలో దిగువ కోర్టు తీర్పు వెలువరించింది. దీనిపై డొనాల్డ్ ట్రంప్ పరిపాలనా యంత్రాంగం ఫెడరల్ అప్పీల్స్ కోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన కోర్టు శుక్రవారం (యూఎస్ కాలమానం ప్రకారం) ఆ పిటిషన్ను తిరస్కరించింది. ఈ రుసుము కాంగ్రెస్ ఆమోదం లేని చట్టవిరుద్ధమైన పన్ను అని పేర్కొంటూ దిగువ కోర్టు నిలిపివేసింది. డెమోక్రటిక్ పార్టీకి చెందిన 20 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ దాఖలు చేసిన వ్యాజ్యంలో భాగంగా ఈ తీర్పు వెలువడింది.
H-1B Visa Fee | ట్రంప్ యంత్రాంగం విఫలం..
దీనిపై స్టే ఇవ్వకపోతే దేశానికి వచ్చే నష్టం ఏమిటని కోర్టు ప్రశ్నించింది. నష్టం ఏంటో తెలియజేయడంలో ట్రంప్ యంత్రాంగం విఫలమయ్యిందని న్యాయస్థానం పేర్కొంది. కాగా విదేశీ కార్మికులను రప్పించుకోవడానికి సాంకేతిక సంస్థలు ఎక్కువగా ఆధారపడే H-1B వీసాల ఖర్చును పెంచుతూ అమెరికా అధ్యక్షుడు సెప్టెంబర్లో ఒక ప్రకటన జారీ చేశారు. హెచ్–1బీ కింద ఏటా 65 వేల వీసాలు జారీ చేస్తారు. దీని కోసం గతంలో సుమారు 2,000 నుండి 5,000 డాలర్ల వరకు రుసుము చెల్లించేవారు. అయితే ట్రంప్ దానికి లక్ష డాలర్లకు పెంచడంతో కొత్తగా విదేశీ నిపుణులను నియమించుకోవడనికి కంపెనీలు ఆలోచనలో పడ్డాయి. ఈ క్రమంలో కోర్టు తీర్పుతో కంపెనీలు ఊరటనిచ్చింది. ఈ వీసాలపై ఎక్కువగా భారతీయులు వెళ్తుంటారు. ఈ రుసుము విధానం అమల్లోకి వచ్చినప్పటి నుండి చాలా తక్కువ మంది యజమానులు మాత్రమే దీనిని చెల్లించారు.
ఇది కూడా చదవండి..: Iran US Conflict | బహ్రెయిన్, జోర్డాన్, కువైట్లో అమెరికా స్థావరాలపై ఇరాన్ డ్రోన్ దాడులు..వెస్ట్ బ్యాంక్లో ఇజ్రాయెల్ భారీ ఆపరేషన్!