Limbadri Narasimha Temple | లింబాద్రి నృసింహుడిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తులు

భీమ్‌గల్ శివారులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానాన్ని ఆదివారం హైకోర్టు న్యాయమూర్తులు దర్శించుకున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ​భీమ్‌గల్: Limbadri Narasimha Temple | భీమ్‌గల్ శివారులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లింబాద్రిగుట్ట(Limbadri Gutta ) శ్రీ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానాన్ని ఆదివారం తెలంగాణ(Telanagana) హైకోర్టు న్యాయమూర్తులు దర్శించుకున్నారు. జస్టిస్ తంగిరాల మాధవి దేవి, జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి, జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్, జిల్లా జడ్జి భరత లక్ష్మి తదితరులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

Limbadri Narasimha Temple | ఆలయ చరిత్ర, క్షేత్ర విశిష్టత

​ఈ సందర్భంగా వారు గర్భగుడిలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు, ఆలయ ప్రధాన అర్చకులు నంబి పార్థసారథి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అలాగే ఆలయ చరిత్ర, క్షేత్ర విశిష్టతలను న్యాయమూర్తులకు వివరించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ ప్రత్యేక పూజలు జరిపించి, తీర్థప్రసాదాలను అందజేశారు. ​హైకోర్టు న్యాయమూర్తుల పర్యటన సందర్భంగా  ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, భీమ్‌గల్ సీఐ సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో ఆలయ పరిసరాల్లో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

uio

ఇది కూడా చదవండి : CJP Protest | నన్ను హీరోను చేయొద్దు.. సీజేపీ అధ్యక్షుడు అభిజిత్​ దీప్కే

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *