Gyaneshwari Yadav Silver | కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు మరో పతకం..వెయిట్‌లిఫ్టింగ్‌లో జ్ఞానేశ్వరి యాదవ్‌కు రజతం

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gyaneshwari Yadav Silver | గ్లాస్గో వేదికగా జరుగుతున్న 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో భారత వెయిట్‌లిఫ్టింగ్ జట్టు మరో పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. మహిళల 53 కేజీల విభాగంలో భారత వెయిట్‌లిఫ్టర్ జ్ఞానేశ్వరి యాదవ్ అద్భుత ప్రదర్శనతో రజత పతకాన్ని కైవసం చేసుకుని దేశానికి మరో విజయాన్ని అందించింది.

Mirabai Chanu Gold | కామన్వెల్త్ గేమ్స్‌లో మీరాబాయి చాను స్వర్ణం.. వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు తొలి గోల్డ్

Gyaneshwari Yadav Silver | స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్ విభాగాల్లో..

పోటీ మొత్తం నిలకడైన ప్రదర్శన కనబరిచిన జ్ఞానేశ్వరి యాదవ్ స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్ విభాగాల్లో సమర్థవంతంగా రాణించి మొత్తం లిఫ్ట్‌లో రెండో స్థానాన్ని దక్కించుకుంది. దీంతో భారత్ పతకాల పట్టికలో మరో విలువైన రజత పతకం చేరింది.

akshara today .jpgsilver

ఇప్పటికే వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత క్రీడాకారులు వరుసగా పతకాలు సాధిస్తూ దేశానికి మంచి ఆరంభాన్ని అందిస్తున్నారు. జ్ఞానేశ్వరి యాదవ్ సాధించిన ఈ రజతం భారత జట్టులో మరింత ఉత్సాహాన్ని నింపింది. మిగిలిన విభాగాల్లోనూ భారత వెయిట్‌లిఫ్టర్లు మెరుగైన ప్రదర్శనతో మరిన్ని పతకాలు సాధించాలని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *