అక్షరటుడే వెబ్‌డెస్క్: Ram Charan Surgery | అగ్ర నటుడు రామ్‌చరణ్ మణికట్టుకు నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతమైంది. ప్రస్తుతం ఆయన కోయంబత్తూరులోని గంగా ఆసుపత్రిలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ‘పెద్ది’ చిత్ర నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షించింది.
Ram Charan Surgery | పెద్ది షూటింగ్‌లోనే గాయం..
‘పెద్ది’ సినిమా షూటింగ్ సమయంలోనే రామ్‌చరణ్ మణికట్టుకు గాయమైంది. అయినప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా, ఆ అంకితభావంతోనే షూటింగ్‌ను కొనసాగించి కీలక సన్నివేశాలను పూర్తి చేశారు. ఆయన చూపిన క్రమశిక్షణ, పట్టుదల తమ టీమ్మందరికీ ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచాయని వృద్ధి సినిమాస్ పేర్కొంది. సోమవారం జరిగిన ఈ సర్జరీ విజయవంతం కావడంతో ఆయన క్షేమంగా ఉన్నారని తెలిపారు.
Ram Charan Surgery | ప్రత్యేక వైద్యుల ఆధ్వర్యంలో సర్జరీ..
కోయంబత్తూరులోని గంగా ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ ఎస్. రాజశేఖరన్ నేతృత్వంలో ఈ శస్త్రచికిత్స జరిగింది. అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ అలెజాండ్రో బాడియా బృందం, డాక్టర్ ప్రవీణ్ భరద్వాజ్ కలిసి ఈ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. చరణ్‌తో పాటు ఆయన సతీమణి ఉపాసన, తల్లిదండ్రులు చిరంజీవి, సురేఖ కోయంబత్తూరు వెళ్లిన సంగతి తెలిసిందే.
Ram Charan Surgery | తదుపరి చిత్రం వివరాలు..
ఇటీవల ‘పెద్ది’ చిత్రంతో ఘన విజయం అందుకున్న రామ్‌చరణ్, తన తర్వాతి సినిమాను ప్రముఖ దర్శకుడు సుకుమార్‌తో చేయనున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన స్క్రిప్ట్ పనులు తుది దశకు చేరుకోగా, ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అక్టోబర్ లేదా నవంబర్ నెలలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.
Get Well Soon & Get Back into Action Dear @AlwaysRamCharan Anna! ❤️#RC17 #RamCharan
🦁⭐ #MegaPowerStar #RamCharan #PeddiInLondon#RastraRamCharanYuvashakthi #RamCharanBirthdayCelebrations #RamCharan𓃵 pic.twitter.com/86v6kcjsxA— 🌟RCharan🔥🌟 REDDY 🔥⭐PRECIDENT OF RAM CHARAN FAN (@CharanR12520030) July 28, 2026
ఇది కూడా చదవండి: CJP Protest | వారిని వదిలేయండి.. విద్యార్థుల అరెస్ట్‌పై సుప్రీంకోర్టు