అక్షరటుడే, వెబ్‌డెస్క్: AAP Paper Leak | పంజాబ్‌లో పేపర్ లీక్ ఆరోపణలపై ఆప్ కార్యాలయం వెలుపల బీజేపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్‌జ్యోత్ సింగ్ బైన్స్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
బీజేపీ ఎంపీ బాన్సురి స్వరాజ్ మాట్లాడుతూ.. ఆప్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆప్ ఎప్పుడూ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తుందన్నారు.
రాష్ట్రంలో ఫార్మసీ రిక్రూట్‌మెంట్ పరీక్షలో జరిగిన అవకతవకల విషయంలో వారు ఎందుకు బాధ్యత తీసుకోవడం లేదని ఆమె ప్రశ్నించారు. నీట్ పరీక్షకు సంబంధించిన అవకతవకల తర్వాత, ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ప్రభుత్వం పేపర్ లీక్ నిరోధక చట్టాన్ని మరింత పటిష్టంగా, కఠినతరం చేసిందన్నారు. మరోవైపు ఆప్ ప్రభుత్వం సాంకేతిక అంశాల వెనుక దాగి, పూర్తి మౌనం వహించాయని విమర్శించారు.
AAP Paper Leak | స్పందించని సీజేపీ
నీట్ పేపర్ లీకేజీ వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలకు ఆప్ మద్దతు తెలిపింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. అయితే సొంత ప్రభుత్వం పేపర్ లీక్ అయితే మాత్రం చర్యలు చేపట్టడం లేదు. మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ సైతం ఈ విషయంలో మౌనంగా ఉండటం గమనార్హం. మిగతా రాష్ట్రాల్లో ఆందోళన చేస్తున్న సీజేపీ మద్దతుదారులు పంజాబ్ విషయంలో స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
ఇది కూడా చదవండి..: Rahul Gandhi Speech | రాహుల్ గాంధీ స్పీచ్‌కు డుమ్మా కొట్టిన కాంగ్రెస్ ఎంపీ