అక్షరటుడే, వెబ్డెస్క్: Yellampalli Project | ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, కడెం ప్రాజెక్టు నుంచి వస్తున్న వరద ప్రవాహం కారణంగా తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా నీరు చేరుతోంది. వరద ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో అధికారులు అప్రమత్తమై ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
Yellampalli Project | 4,16,358 క్యూసెక్కుల వరద నీరు
ప్రాజెక్టు మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 19.703 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 4,16,358 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. ఇందులో కడెం ప్రాజెక్టు నుంచి 1,56,279 క్యూసెక్కులు, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా 2,60,079 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది.
Anti Paper Leak Bill | యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం..పరీక్షల్లో అక్రమాలకు ఇక కఠిన శిక్షలు
Yellampalli Project | 30 గేట్ల ద్వారా 3,74,275 క్యూసెక్కులు విడుదల
వరద ఉద్ధృతిని దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రాజెక్టులోని 30 గేట్లను ఎత్తి 3,74,275 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అదనంగా నంది పంప్ హౌస్ ద్వారా 15,750 క్యూసెక్కుల నీటిని తరలిస్తుండగా, హైదరాబాద్ నగర తాగునీటి అవసరాల కోసం 275 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. మొత్తం 3,90,300 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టు నుంచి బయటకు వెళ్తోంది.
Yellampalli Project | అప్రమత్తంగా ఉండాలంటూ…
వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రాజెక్టు దిగువన ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నదీ తీర ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, స్థానిక పరిపాలన యంత్రాంగం జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. వరద పరిస్థితులను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నారు.