Spouse Transfer Issue | స్పౌస్ ఫ్యాక్టర్ అమలుపై గందరగోళం.. ఉద్యోగుల్లో ఆందోళన!

Naresh Chandan
Spouse Transfer Issue

అక్షరటుడే, హైదరాబాద్: Spouse Transfer Issue | తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన G.O.Ms.No.38 (21.04.2026) ప్రకారం కొనసాగుతున్న సాధారణ బదిలీలలో ‘స్పౌస్ ఫ్యాక్టర్’ అమలుపై స్పష్టత లేకపోవడం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళనకు దారి తీసింది. భార్యాభర్తలు ఒకే ప్రాంతంలో పని చేసేలా సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ విధానం ఉన్నప్పటికీ, అమలులో తలెత్తుతున్న సమస్యలు కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

akshara today .jpg TG

Spouse Transfer Issue | ప్రథమ ప్రాధాన్యం

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం స్పౌస్ కేసులకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. దీనికితోడు ఈ కేసుల్లో మూడు సంవత్సరాల సర్వీస్ నిబంధన వర్తించదని స్పష్టంగా పేర్కొనబడింది. అయితే, గత బదిలీల అనుభవం చూస్తే ఈ నిబంధనలు పూర్తిగా అమలు కాలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రత్యేకంగా 40 శాతం పరిమితి పేరుతో స్పౌస్ కేసులను తిరస్కరించడం, బదిలీ ప్రక్రియలో పారదర్శకత లోపించడం, విభాగాల వారీగా భిన్న విధానాలు అనుసరించడం వంటి అంశాలు సమస్యలను మరింత తీవ్రమయ్యేలా చేస్తున్నాయి. ఫలితంగా అనేక మంది ఉద్యోగులు కుటుంబాల నుంచి దూరంగా పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ పరిస్థితి కేవలం పరిపాలనా సమస్యగానే కాకుండా, కుటుంబ వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతోంది. దంపతులు వేర్వేరు ప్రాంతాల్లో పనిచేయాల్సి రావడం వల్ల పిల్లల సంరక్షణ, కుటుంబ బాధ్యతలు, వ్యక్తిగత జీవితం దెబ్బతింటోంది. మానసిక ఒత్తిడి పెరిగి, ఉద్యోగుల పనితీరుపై కూడా ప్రభావం పడుతున్నట్లు తెలుస్తోంది.

akshara today .jpg spouce

Spouse Transfer Issue | ఉద్యోగుల డిమాండ్​..

ప్రభుత్వం వెంటనే స్పందించి స్పౌస్ ఫ్యాక్టర్ అమలుపై స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. ప్రథమ ప్రాధాన్యంగా ఈ కేసులను పరిగణనలోకి తీసుకోవడం, మూడు సంవత్సరాల సర్వీస్ నిబంధన వర్తించదని స్పష్టత ఇవ్వడం, కౌన్సెలింగ్ ప్రక్రియలో పారదర్శకతను తీసుకురావడం వంటి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Telangana IAS Transfers | తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఒకేసారి భారీ స్థాయిలో ఐఏఎస్​ల బదిలీ!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *