అక్షరటుడే, వెబ్‌డెస్క్: Anantapur School Hostel | అనంతపురం జిల్లా (Anantapur District) విడపనకల్లు మండలంలోని మోడల్ స్కూల్ హాస్టల్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. హాస్టల్లో ఉంటున్న ఇద్దరు విద్యార్థినులను మరో తోటి విద్యార్థిని బ్లేడుతో గొంతు కోసి చంపేందుకు యత్నించడం స్థానికంగా కలకలం రేపింది. బ్లేడు సరిగా తెగకపోవడంతో బాధితులు స్వల్ప గాయాలతో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ హఠాత్పరిణామంతో హాస్టల్లోని మిగతా విద్యార్థినులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
Anantapur School Hostel | వార్డెన్ నిర్లక్ష్యంపై విమర్శలు..
ఇంతటి తీవ్రమైన ఘటన జరిగినప్పటికీ, పాఠశాల హాస్టల్ వార్డెన్ ఈ విషయాన్ని బాధితుల తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గోప్యంగా ఉంచడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు పాఠశాల సిబ్బంది తీరుపై మండిపడుతున్నారు. పాఠశాల ప్రాంగణంలో విద్యార్థినుల భద్రత, రక్షణపై పెద్ద ఎత్తున ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులైన వారిపై, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డెన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇద్దరు విద్యార్థినుల గొంతు కోసేందుకు విద్యార్థిని యత్నం
బ్లేడు సరిగా తెగకపోవడంతో స్వల్ప గాయాలతో తృటిలో తప్పించుకున్న విద్యార్థినులు
తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా దాచిపెట్టిన వార్డెన్
అనంతపురం జిల్లా విడపనకల్లు మోడల్ స్కూల్ హాస్టల్ లో దారుణం pic.twitter.com/SDb5iZD1TD
— Telugu Feed (@Telugufeedsite) August 1, 2026
ఇది కూడా చదవండి..: Bhogapuram Airport | భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ